Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kaushik Reddy Mining Scam Allegations Telangana

Kaushik Reddy : ప్రభుత్వానిది మైనింగ్ స్కామ్.. నా పర్సనాలిటీపై ఏడిస్తే ఎలా.?

Published Date :April 1, 2026 , 2:11 pm
By Gogikar Sai Krishna
  • మైనింగ్ కుంభకోణంపై ప్రభుత్వాన్ని నిలదీసిన కౌశిక్ రెడ్డి
  • హౌస్ కమిటీ ఎందుకు వేయరని ప్రశ్నల వర్షం
  • ఎథిక్స్ కమిటీపై ఆగ్రహం.. వ్యక్తిగత వ్యాఖ్యలపై స్పందన
  • సిఐడి నోటీసులు, పోలీసులకు కౌశిక్ రెడ్డి వార్నింగ్
Kaushik Reddy :  ప్రభుత్వానిది మైనింగ్ స్కామ్.. నా పర్సనాలిటీపై ఏడిస్తే ఎలా.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ కుంభకోణం , అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మైనింగ్ స్కామ్ నుండి తన వ్యక్తిగత పర్సనాలిటీ వరకు ప్రతి అంశంపై ఆయన క్లారిటీ ఇస్తూనే, అధికార పార్టీ తీరును తప్పుబట్టారు.

రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కుంభకోణంపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా అన్ని విషయాలను బయటపెట్టారని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. “నిజంగా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉంటే హరీష్ రావు అడిగినట్లు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు?” అని ఆయన ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భాగస్వామ్యం ఉందని, ఆ కారణం చేతనే ఈ స్కామ్‌పై విచారణకు ప్రభుత్వం వెనకాడుతోందని ఆయన సంచలన ఆరోపణ చేశారు.

PM Modi: తేయాకు తోటలో కూలీలతో కలిసి పని చేసిన మోడీ.. ఫొటోలు వైరల్

తనపై ఎథిక్స్ కమిటీ వేయడంపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఎమ్మెల్యే దానం నాగేందర్ వాడిన భాష ఎథిక్స్ కమిటీ పరిధిలోకి రాదా అని నిలదీశారు. తన వ్యక్తిగత పర్సనాలిటీపై చేసిన కామెంట్లకు బదులిస్తూ.. “నేను స్పోర్ట్స్ పర్సన్‌ని. అండర్-19 క్రికెట్ ఆడే సమయంలో దేశంలోనే ఫిట్టెస్ట్ ప్లేయర్‌గా ఉన్నాను. 20 ఏళ్ల కష్టం ఈ బాడీ. నా పర్సనాలిటీ మీద ఏడిస్తే ఎలా?” అంటూ ఘాటుగా స్పందించారు. ఎథిక్స్ కమిటీ ముందు అన్ని విషయాలను ధైర్యంగా చెబుతానని వెల్లడించారు.

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా కౌశిక్ రెడ్డి విమర్శలు సంధించారు. “కడియం శ్రీహరి గారు.. కేసీఆర్ మీకు ఏం తక్కువ చేశారు? అసలు మీరు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో అసెంబ్లీలో స్పష్టం చేయమని అడిగితే తప్పేంటి?” అని ప్రశ్నించారు. కడియం వ్యవహారశైలిపై అసెంబ్లీలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదని ఆయన పేర్కొన్నారు.

హుజురాబాద్‌లోని డంపింగ్ యార్డ్ ఏర్పాటును అడ్డుకోవడానికి తాను ఈ నెల 4న చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి సిఐడి నోటీసులు ఇచ్చారని కౌశిక్ రెడ్డి తెలిపారు. “కరీంనగర్ సీపీ మీద వేయాల్సిన సిఐడి ఎంక్వైరీ నా మీద వేశారు. 4వ తేదీన విచారణకు పిలిస్తే వెళ్తాను, కానీ 5 లేదా 6వ తేదీల్లో డంపింగ్ యార్డును అడ్డుకుని తీరుతాను” అని ప్రకటించారు. అలాగే, ప్రస్తుతం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసు అధికారులపై మండిపడుతూ.. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిఐడి విచారణలు పోలీసుల మెడకే చుట్టుకుంటాయని హెచ్చరించారు.

Prabhas : బైకర్ కోసం యుద్ధ భూమి నుండే వచ్చేశాడు డ్యూడ్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • Kaushik Reddy
  • mining scam
  • revanth reddy
  • Telangana Politics

తాజావార్తలు

  • Kaushik Reddy : ప్రభుత్వానిది మైనింగ్ స్కామ్.. నా పర్సనాలిటీపై ఏడిస్తే ఎలా.?

  • Akhil Akkineni : అయ్యగారితో మారుతీ చర్చలు.. ఇద్దరికీ హిట్ కంపల్సరీ

  • Midhun Reddy: అమరావతి బిల్లుతో ప్రజలకు మేలు జరగదు.. మిధున్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • Dacoit: అడివి శేష్ ‘డెకాయిట్’ ప్రీ-రిలీజ్ హంగామా.. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బిజినెస్!

  • Deputy CM Pawan Kalyan: నేతన్నలకు గుడ్ న్యూస్.. నేటి నుంచే ఉచిత విద్యుత్ అమలు.. వెల్లడించిన డిప్యూటీ సీఎం

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions