Akhil Akkineni : అయ్యగారితో మారుతీ చర్చలు.. ఇద్దరికీ హిట్ కంపల్సరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని వారసుడు అఖిల్ తన కెరీర్ విషయంలో ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఏజెంట్’ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చడంతో, ఈసారి కచ్చితంగా కమర్షియల్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం అఖిల్ తన తదుపరి చిత్రం ‘లెనిన్’ పనుల్లో బిజీగా ఉండగా సోషల్ మీడియాలో మరో క్రేజీ కాంబో గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : Release Post Poned : టాలీవుడ్ లో సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ ట్రెండ్
Also Read
- JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మారుతితో అఖిల్ నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరి మధ్య ఇప్పటికే చర్చలు జరిగినట్లు సమాచారం. మారుతి గతంలో అక్కినేని నాగచైతన్యతో చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని హీరోల బాడీ లాంగ్వేజ్‌ను మారుతి డీల్ చేసిన విధానం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో, అఖిల్ కోసం కూడా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌ను మారుతి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మారుతి మాత్రమే కాకుండా అఖిల్ మరికొందరు యువ దర్శకులతో కూడా కథలు వింటున్నట్లు టాక్. మారుతి లాంటి మినిమం గ్యారెంటీ దర్శకుడితో సినిమా చేయడం వల్ల అఖిల్‌కు మాస్ ఆడియన్స్‌లో మంచి రీచ్ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ‘రాజా సాబ్’ తో భారీ డిజాస్టర్ అందుకున్న మారుతి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి మారుతి కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే అక్కినేని అభిమానులకు పండగే అని చెప్పాలి.
తాజావార్తలు
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!