Prabhas : బైకర్ కోసం యుద్ధ భూమి నుండే వచ్చేశాడు డ్యూడ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన అభిమానులను మరోసారి మిర్చి రోజుల్లోకి తీసుకెళ్లిపోయాడు డార్లింగ్ ప్రభాస్. టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘బైకర్’ పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మించింది. అటు శర్వానంద్‌తో ప్రభాస్‌కు మంచి బాండింగ్ ఉంది. దీంతో.. ఈ సినిమా కోసం ప్రభాస్ రంగంలోకి దిగాడు. బైకర్ చిత్ర యూనిట్‌కు తన బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు డార్లింగ్. తనదైన స్టైలిష్ లుక్‌లో బైక్‌పై వచ్చి.. ‘ట్రైలర్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అంటూ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
- FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్‌లు..! ప్రత్యేక మెకానిజం
Also Read : Prabhas : స్పిరిట్.. ఎక్కడి వరకు వచ్చింది?
ఇక ప్రభాస్‌కు థ్యాంక్యూ చెబుతూ.. ‘అన్న.. నీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ నాపై ఉండటం నా అదృష్టం, మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అంటూ శర్వానంద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే, ప్రభాస్ లేటెస్ట్ లుక్ మాత్రం మామూలుగా లేదనే చెప్పాలి. ఈ లుక్ ఆయన కెరీర్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘మిర్చి’ సినిమా రోజులను గుర్తుకు తెస్తోంది. అయితే, ఈ లుక్ మాత్రం ఆయన నటిస్తున్న ఫౌజీ చిత్రంలోనిదే అని చెప్పాలి. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ప్రభాస్. 1940 బ్యాక్ డ్రాప్‌లో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాలో సైనికుడిగా కనిపించనున్నాడు ప్రభాస్. దీంతో.. బైకర్ ప్రమోషన్ వీడియో షూట్ కోసం ఆయన డైరెక్ట్‌గా యుద్ధ భూమి నుంచే వచ్చినట్టుగా ఉందని.. రెబల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. బైకర్ సినిమాకు ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ సపోర్ట్ తోడవడంతో మరింత హైప్ క్రియేట్ అవుతోంది. కాగా, ఏప్రిల్ 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్‌పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!