Karthika Mahotsavam 2023: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం కార్తీక మాసోత్సవాలకు సిద్ధం అవుతోంది.. శ్రీశైలంలో నవంబర్ 14వ తేదీ నుండి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు.. కార్తీకమాసం నిర్వహణ, భక్తుల ఏర్పాట్లపై ఈవో పెద్దిరాజు అధికార, అర్చకులతో సోమవారం రోజు సన్నాహక సమావేశం నిర్వహించారు.. కార్తీక మాసంలో సర్వ సాధారణంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ ఉంటుంది.. ముఖ్యంగా శ్రీశైలం మల్లన్న దర్శానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా తరలివస్తుంటారు.. దీంతో.. భక్తుల రద్దీ దృష్ట్యా కార్తీక శని, ఆది, సోమ, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో సామూహిక, గర్భాలయా అభిషేకాలు, స్పర్శ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు.. శని, ఆది, సోమ వారాల్లో భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.. రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన రద్దు చేయనున్నారు.. సాధారణలో రోజులలో కూడా సామూహిక, గర్భాలయ అభిషేకాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు దేవస్థానం అధికారులు.. ఇక, కార్తీక దీపారాధనకు భక్తులకు ఆలయ ఉత్తర మాడవీధిలో ఏర్పాటు చేయనున్నారు.. 27వ తేదీన కార్తీక పౌర్ణమి అయిన 26న పౌర్ణమి ఘడియలు రావడంతో కృష్ణమ్మకు పుణ్య నదిహారతి, సారే సమర్పణ, జ్వాలతోరణం నిర్వహించాలని నిర్ణయించింది శ్రీశైలం దేవస్థానం పాలకమండలి.
Read Also: November New Rules : నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్..