DK Shivakumar: కర్ణాటక క్యాబినెట్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ముస్లిం కాంట్రాక్టర్లకు 4 శాతం రిజర్వేషన్ కల్పించడంపై బీజేపీ విరుచుకుపడుతోంది. ముస్లిం వర్గాన్ని సంతృప్తి పరచడానికి, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ ముస్లిం లీగ్ అంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
Karnataka Budget: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఆర్థిక మంత్రి హోదాలో ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్‌పై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. బీజేపీ నేత జీఎస్ ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌ని ‘‘ముస్లిం లీగ్ బడ్జెట్’’గా అభివర్ణించారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారీ కూడా ఈ బడ్జెట్‌ని తీవ్రంగా తప్పుపట్టారు. మైనారిటీల బుజ్జగింపు బడ్జెట్‌గా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్లపై ధర పరిమితిని విధించింది. ఏ సినిమా అయినా సరే టికెట్టు ధర రూ.200 మించకూడదని ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టిక్కెట్లపై ధర పరిమితి రూ.200 మించకూడదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అన్ని భాషల చిత్రాలకూ ఈ నియమం వర్తిస్తుంది. ఈ నిబంధన ఉల్లంఘించొద్దని మల్టీఫ్లెక్స్‌లకు కూడా ప్రభుత్వం తెలిపింది.
Karnataka: కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఇప్పుడు ఆ రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కర్ణాటక హోం మినిస్టర్ బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతూ.. ఈ సారి ముస్లిం సమాజానికి బడ్జెట్ కేటాయింపుల విషయంలో ఎక్కువ ఇచ్చామని అన్నారు. దీనిపై బీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. మంత్రి వ్యాఖ్యల్ని బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఇది వివక్ష అంటూ విమర్శించారు.
ఆర్థిక మంత్రి హోదాలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులకు 100 కోట్ల రూపాయలు.. క్రైస్తవ సమాజానికి 200 కోట్ల రూపాయల కేటాయించారు.