ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి చిత్రాల్లో ‘కాంతార’ కూడా ఒకటి. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమైంది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించారు. 2025 దసరా కానుకగా అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ రికార్డులు సృష్టించింది. 24 గంటల్లో అన్ని భాషలు కలిపి 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టింది.
కాంతార: చాప్టర్ 1పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదే స్థాయిలో సినిమాను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర యూనిట్ కూడా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా స్క్రీన్‌లలో సినిమాను రిలీజ్ చేయనుంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ భాషలో విడుదల కానుంది. కాంతారకు దక్కిన ఆదరణతో ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులను కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసింది. మొత్తానికి కాంతార టీమ్ విడుదలను గట్టిగానే ప్లాన్ చేసింది.
Also Read: Haris Rauf: హారిస్ రవూఫ్‌కు మద్దతు.. పాకిస్థాన్ మహిళా ప్లేయర్స్ సైతం కవ్వింపులు!
కాంతార చాప్టర్ 1కు U/A 16+ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 48 నిమిషాకు. 16+ జారీ చేసిన నేపథ్యంలో ఈ సినిమాకు చిన్న పిల్లలకు అవకాశం లేదని చెప్పవచ్చు. యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ భారీ హైప్ తీసుకొచ్చాయి. సినిమా కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.