మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వరుస సినిమాల తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు..మమ్ముట్టి తెలుగులో యాత్ర సినిమా లో నటించి మంచి విజయం అందుకున్నారు. అలాగే రీసెంట్ గా అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ మూవీ లో కూడా కీలక పాత్ర లో కనిపించారు.ప్రస్తుతం ఈ మెగాస్టార్ బజూక సినిమాతో పాటు భ్రమయుగం, యాత్ర 2 వంటి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మమ్ముట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ‘కన్నూర్ స్క్వాడ్’. ఈ సినిమా కు సినిమాటోగ్రాఫర్ రాబి వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 28 న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కాగా.. తాజాగా ఈ సినిమా ఓటీటీ లో విడుదల కాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ పై మేకర్స్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఇక ఈ సినిమాలో మమ్ముట్టి తో పాటు.. కిషోర్, విజయరాఘవన్, రోనీ డేవిడ్ రాజ్, అజీజ్ నెడుమంగడ్, శబరీష్ వర్మ, శరత్ సభ మరియు సన్నీ వేన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాను మమ్ముట్టి సొంత బ్యానర్ మమ్ముట్టి కంపెనీ నిర్మిచింది.ఈ సినిమా కథ విషయానికి వస్తే .. కన్నూరు అనే ప్రాంతం లో జరిగిన మిస్టరీ డెత్స్ అలాగే రాబరీ కేసులకు సంబంధించి దోషుల ను పట్టుకునే జార్జ్ మార్టిన్ అనే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా మమ్ముట్టి ఎంతగానో మెప్పించారు… ఇక మమ్ముట్టితో కూడిన స్క్వాడ్ టీం ఈ కేసును ఏ విధంగా చేధించింది. ఈ క్రమం లో వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా కథ..థియేటర్స్ లో బాగా అలరించిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి..