Bhakthi TV Koti Deepotsavam 2024 : భక్తి టీవీ కోటి దీపోత్సవం.. నవంబర్ 9 నుంచి 25 వరకు..
- నవంబర్ 9 నుంచి 25 వరకు భక్తి టీవీ కోటి దీపోత్సవం
- హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కోటిదీపోత్సవ మహాయజ్ఞం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhakthi TV Koti Deepotsavam 2024 : కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది.. హిందువులకు ఈ నెల శివుడు, విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రంగా భావిస్తారు.. కార్తీక స్నానాలకు, ఈ మాసం వివిధ వ్రతాలకు శుభప్రధమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.. ఇక, కార్తీక మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తుల చూపు మొత్తం ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవంపైనే ఉంటుంది.. ఈ ఏడాది కూడా ఘనంగా కోటిదీపోత్సవ యజ్ఞాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది భక్తి టీవీ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబర్ 9 నుంచి 25 వరకు కోటిదీపోత్సవ మహాయజ్ఞం జరగనుంది.
లక్ష దీపాలతో ప్రారంభించిన ఈ దీప యజ్ఞాన్ని ఆ తర్వాత కోటి దీపోత్సవంగా విస్తరించింది ఎన్టీవీ-భక్తి టీవీ యాజమాన్యం.. దేదీప్యమానంగా వెలిగే దీపపు కాంతులు, ప్రచానామృతాలు, కల్యాణ కమనీయాలతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తే కోటి దీపోత్సవం ఈ నెల నవంబర్ 9వ తేదీన ప్రారంభం కానుంది.. ప్రతీ రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాగే ఈ దీపయజ్ఞం నవంబర్ 25వ తేదీ వరకు కొనసాగనుంది.. శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒక్క వేదిక మీదకు తెచ్చేందుకు ఈ పవిత్ర దీపోత్సవం సాగుతోంది.. ఇక, వేలాది మంది భక్తులతో కోటిదీపోత్సవ ప్రాంగణం వెలిగిపోతుంది.. ప్రవచనాలతో మొదలై, ప్రత్యేక అర్చనలు, దేవదేవుల కళ్యాణాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతోన్న ఈ దీపయజ్ఞంలో వివిధ పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు తమ సందేశాలు ఇస్తారు.. నవంబర్ 9 నుంచి ఆరంభంకాబోతోన్న దీప యజ్ఞంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది ఎన్టీవీ – భక్తి టీవీ.
Also Read
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
- Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
- Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!