ఈ సారి కందుకూరు అసెంబ్లీ సీటు నాకు లేదని.. రాదని కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. నా సీటు ఎక్కడికీ పోలేదు.. నా సీటులో టవలేసి మరీ ఇక్కడే ఉంది అంటూ చమత్కరించారు.. నేను సీట్ల కోసం, పదవులకోసం వెంపర్లాడే వాడిని కాదని స్పష్టం చేశారు కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి..
Tula Uma: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల వ్యవహారం వేడెక్కుతోంది. పార్టీలోని ప్రముఖ నేతలు తమ మద్దతుదారులకు టిక్కెట్లు ఇచ్చారు. కొందరికి ఆశించిన ఫలితాలు రాగా, మరికొందరికి బీజేపీ హైకమాండ్ మొండిచేయి చూపింది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారాయి. వరుసగా రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో ఆపార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ లోని కీలక నేతలంతా ఎవరి దారి వారు చూసుకోవడంతో ఆపార్టీ నడిపించాల్సి బాధ్యత ‘గాంధీ’ కుటుంబంపైనే పడింది. దీంతో ఆ కుటుంబంలోని ప్రతీఒక్కరు వచ్చే ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకొని బరిలో దిగుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు ముందు వస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్…