SYG : సంక్రాంతి బరిలో భారీ పోరు..రేసులోకి సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ పరిశ్రమలో పండగ సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌ను టాలీవుడ్ హీరోలు, మేకర్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాబోయే సంక్రాంతి సమరం మరింత రంజుగా మారబోతోంది. ఏకంగా ఐదు క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతుండటంతో టాలీవుడ్లో సరికొత్త వైబ్రేషన్స్ మొదలయ్యాయి. సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘SYG’ (సంబరాల ఏటిగట్టు) నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. వెనక భారీగా మంటలు చెలరేగుతుండగా, ఒళ్లంతా నెత్తుటి మరకలతో, చేతిలో పదునైన ఆయుధం పట్టుకుని రౌద్రంగా దూసుకొస్తున్న సాయి దుర్గా తేజ్ ఊరమాస్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12, 2027న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కె. నిరంజన్ రెడ్డి సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్టర్‌తోనే భారీ అంచనాలను పెంచేసింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మహాకాళి’ కూడా సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు ఇప్పటికే పలు భారీ కాంబినేషన్లు పండగ రేసులో పోటీకి సిద్ధమయ్యాయి. వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ క్రేజీ మల్టీస్టారర్, మాస్ మహారాజా రవితేజ – శ్రీవిష్ణు ఎంటర్టైనర్, శర్వానంద్ – శ్రీనువైట్ల కాంబో చిత్రం, ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’, సాయి దుర్గా తేజ్ ‘SYG (సంబరాల ఏటిగట్టు)’. స్టార్ హీరోలు, డిఫరెంట్ జానర్ సినిమాలతో బాక్సాఫీస్ బరి కిక్కిరిసిపోవడంతో రాబోయే పండగ వినోదం ప్రేక్షకులకు అసలైన విందుగా మారనుంది.
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?