Andhra Cricket Association: ఏపీ మహిళా క్రీడాకారులకు శుభవార్త.. సెప్టెంబర్ 15 నుంచే ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ రంగంలో మహిళా క్రీడాకారులకు కొత్త ఊపిరి పోస్తూ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని శివనాథ్ నేతృత్వంలో ఉమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఇటీవల మెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజయవంతం కావడంతో, మహిళా క్రికెట్‌కు ప్రాముఖ్యతనిస్తూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కొత్త లీగ్‌ను అధికారికంగా ప్రకటించారు.
ఈ టోర్నమెంట్ భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో జరగనుంది. సెప్టెంబర్ 15 నుండి 26 వరకు మంగళగిరి మైదానంలో డే-నైట్ మ్యాచ్‌లుగా ఈ టోర్నీ సాగుతుంది. ఈ లీగ్ కోసం నాలుగు ఫ్రాంచైజీ జట్లను వేలం ద్వారా ఎంపిక చేశారు. వేలంలో ప్రారంభ ధర రూ. 35 లక్షలుగా నిర్ణయించగా, అత్యధికంగా ఉషోదయ ఎంటర్ప్రైజెస్ రూ. 89 లక్షలకు ఒక జట్టును దక్కించుకుంది. మిగిలిన మూడు జట్లను వరుసగా రూ. 88.50 లక్షలు, రూ. 77.77 లక్షలు, మరియు రూ. 61.11 లక్షలకు యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఈ మ్యాచ్‌లకు పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. 4 జట్లతో ప్రారంభమవుతున్న ఈ లీగ్‌ను భవిష్యత్తులో మరిన్ని జట్లతో విస్తరించడంతో పాటు, మూలపాడు వద్ద త్వరలోనే ఒక ప్రత్యేక క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నట్లు ఏసీఏ తెలిపింది.
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ఏసీఏతో గత 2-3 ఏళ్లుగా అనుబంధం ఉన్న మిథాలీ రాజ్ ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఏసీఏ నుంచి స్నేహ్ దీప్తి వంటి ఆటగాళ్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిందో, ఈ ప్రాంతీయ లీగ్ కూడా ఆ స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేలం విధానం ద్వారా మహిళా క్రికెట్‌కు ప్రాముఖ్యత, ఆర్థిక విలువ, విజిబిలిటీ పెరుగుతాయని పేర్కొన్నారు.
ఈ లీగ్ ద్వారా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, విభిన్న కేటగిరీల ప్లేయర్లకు ప్రొఫెషనల్ స్థాయి ఎక్స్పోజర్ లభిస్తుందని వివరించారు. ఫ్రాంచైజీలు కూడా రూరల్ టాలెంట్‌ను గుర్తించే బాధ్యతను తీసుకుంటుండటం విశేషం. ఏసీఏ చేపట్టిన ఈ ప్రొఫెషనల్ చొరవ వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నుంచి మరిన్ని కొత్త తారలు భారత జాతీయ జట్టుతో పాటు WPLలో మెరిసే అవకాశం ఉందని మిథాలీ రాజ్ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?