Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
- ప్రత్యేక హోదా ఉంటే పీఓకే కూడా జమ్మూ కాశ్మీర్లో కలిసేదే..
- పీఓకే పరిస్థితులు చాలా బాధిస్తు్న్నాయి..
- సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జమ్మూ కాశ్మీర్ పరిస్థితి మారకుంటే , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు కూడా భారత్‌లో తిరిగి కలవాలని కోరుతూ ఈ రోజు వీధుల్లో నిరసన చేసేవారని అన్నారు. శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు చేపట్టిన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం, అరెస్టు కావడం తనను బాధించిందని తెలిపారు.
1947లో పాకిస్తాన్ నుంచి వచ్చిన గిరిజన ఆక్రమనదారుల దాడుల్ని ఎదురించి భారత్‌లో విలీనం కావాలని నిర్ణయించుకున్న కాశ్మీరీల నిర్ణయం సరైనదే అని నేడు పీఓకే పరిస్థితిని చూస్తే అర్థమవుతోందని అన్నారు. ఆ సమయంలో భారత్ సైన్యం కాశ్మీర్ చేరుకునే ముందే స్థానికులు ఆక్రమణదారులపై దాడికి సిద్ధమయ్యారని అన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకే ప్రాంతానికి సంబంధించిన కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయని, ఏదో రోజు ఆ ప్రాంతం కూడా భారత్‌లో కలుస్తుందనే ఆశ ఉందని అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన హామీల పునరుద్ధరణ కోసం తన ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుందని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
2019లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసింది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్‌ను లడఖ్, జమ్మూకాశ్మీర్‌గా విభజించింది. అయితే, ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రతిపక్ష నేత సునీల్ శర్మ విమర్శించారు. సీఎం వ్యాఖ్యలు బాధ్యతారహితమైందిగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!