Kanaka Durga Temple: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది.. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు.. చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.. వేసవి దృష్ట్యా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు చైర్మన్ కర్నాటి రాంబాబు.. అన్నదాన భవనం, ప్రసాదం పోటుకి త్వరలోనే టెండర్లకు ఆహ్వానిస్తున్నాం.. దీనిపై నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇక, సాయంత్రం సమయంలోనూ అన్నదానం నిర్వహించాలని నిర్ణయించాం.. భక్తుల…