సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుండి పార్టీని బలోపేతం చేసుకుని ప్రతి ఓటర్ను గుర్తించి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించాలని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జలదంకి మండలం బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. జలదంకి మండల కన్వీనర్ కె. మధుమోహన్ రెడ్డి అధ్యక్షతన…