Jyothi Surekha Venam: తాజాగా షాంఘై నగరంలో వరల్డ్ ఆర్చరీలో విజయవాడకు చెందిన ఆర్చర్ జ్యోతి సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శనతో ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 ఈవెంట్ లో భారత్ కు ఆధిపత్యాన్ని తీసుకొచ్చింది. జ్యోతి సురేఖ.. తన వ్యక్తిగత, ఉమెన్స్ కాంపౌండ్ టీమ్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్ లో భాగంగా తాను స్వర్ణ పతకాలను గెలిచింది. ఇక వరల్డ్ ఆర్చరీ ఈవెంట్స్ లో వెన్నం జ్యోతి సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది.
Also Read: Sundar Pichai: ఎమోషనల్ పోస్ట్ చేసిన గూగుల్ సీఈఓ.. 20 ఏళ్ల బంధం అంటూ..
మెక్సికోకు చెందిన ఆండ్రియా బిసెర్రాపై మహిళల వ్యక్తిగత కాంపౌండ్ కేటగిరీలో జ్యోతి సురేఖ 146-146 తేడాతో విజయం సాధించారు. ఈ దెబ్బకి వరల్డ్ ఆర్చరీ కాంపౌండ్ క్యాటగిరీలో తాను స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం ఇది మూడవసారి.
Also Read: Gold Found: ఓర్ని.. ‘అక్కడ’ అంత బంగారం ఎలా పెట్టావురా బాబు.. నీ తెలివితగలయ్యా!
ప్రపంచ పోటీల్లో దీపా కుమారి తర్వాత ఒక వరల్డ్ కప్ స్టేజ్‌లో 3 గోల్డ్ మెడల్స్ సాధించిన రెండవ భారతీయ ఆర్చర్ గా జ్యోతి సురేఖ నిలిచింది. ఇదే టోర్నీలో తన వ్యక్తిగత పోటితోపాటు కాంపౌండ్ మిక్స్‌డ్, ఉమెన్స్ కాంపౌండ్ టీమ్ కేటగిరీల్లోనూ సురేఖ బంగారు పథకాలను గెలుచుకుంది. ఇక ట్రెబుల్ కేటగిరీలో గెలిచిన కాంపౌండ్ ఫిమేల్ ఆర్చర్ గా మూడవ వ్యక్తిగా కూడా సురేఖ నిలిచారు. ఈ కేటగిరీలలో ఇప్పటివరకు 2016లో సారా లోపేజ్, 2017 లో సారా సోనిచన్ ఈ కూడా అవార్డులను గెలుచుకున్నారు.
Indian campaign off to a stunning start at Archery World Cup in Shanghai with India winning 4 out of 5 Gold medal on offer in Compound events.
Gold: Jyothi Vennam: Women Individual event
Gold: Women Team event: Jyothi Vennam, Aditi Swami & Parneet Kaur
Gold: Men Team event:… pic.twitter.com/D5zXAAv9lz— India_AllSports (@India_AllSports) April 27, 2024