తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రంలో ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి గ్రూప్ కి వార్నింగ్ ఇస్తూ.. ఈరోజు సమావేశానికి రాని నాయకులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అని చెప్పుకునే కొంతమంది నాయకులు పదవులు పొంది పార్టీ సమావేశాన్ని రాని నాయకులకు చాలా దురదృష్టమన్నారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ సమావేశానికి రాకుండా ఉండే నాయకులు ఆలోచించుకోవాలి ఏ పార్టీ వైపు ఉంటారు అని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.
Also Read : Women’s World Boxing Championship: స్వర్ణం గెలిచిన నీతూ.. ఆరో మహిళగా రికార్డు
మన పార్టీ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్, బీజేపీ పార్టీల లాగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలు లేదన్నారు. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు అని, కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కి పాలించాలని అనుకుంటుందన్న కడియం.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి మద్దతు తెలపని పార్టీలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో బెదిరిస్తుందని ఆరోపించారు. అంతేకాకుండా.. రాజకీయ కక్ష సాధింపులకు భాగంగా రాహుల్ గాంధీని పార్లమెంట్‌లో సస్పెండ్ చేయించారన్నారు కడియం శ్రీహరి.
Also Read : Jio True 5G: 5జీలో జియో దూకుడు.. లక్ష టవర్లు ఏర్పాటు..