రాజయ్య.. కడియం మధ్య మాటలయుద్దం కొనసాగుతుంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంల ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య ఉన్న విభేదాలు మరో సారి బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. ఎమ్మెల్యే రాజయ్యపై మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్టేషన్ ఘనపుర్ నియోజకవర్గంలోని లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో జరిగిన కురుమ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆత్మ అభిమానంతోనే బతకాలని, ఆత్మ అభిమానంతోనే రాజకీయాలు చేయాలని సూచించారు. కడియం శ్రీహరి ఎప్పుడు ఎవరికి కూడా తలవంచి పాదాభివందనం చేయలేదని,ఎవరి దగ్గర తలవంచలేదాన్ని అయినా కడియం శ్రీహరి ఎక్కడ తప్పు చేయలేదన్నారు.. రాజకీయాలు చేసే అన్ని చేస్తాం కానీ ఎవరి దగ్గర తలవంచకుండా నిటారుగా ఉంటామని అన్నారు.
Also Read : Goshala at CM YS Jagan House: సీఎం జగన్ నివాసంలో ప్రత్యేక గోశాల.. నిత్య పూజలు..!
తప్పు చేసేవాళ్లే అయ్యా అంటూ తలవంచుతారని అన్నారు. అందరూ దొడ్డి కొమురయ్యను స్పూర్తిగా, చుక్క సతయ్యను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. అందిరిలో సామాజిక చైతన్యం రావాలి,చదువుతోనే సామాజిక చైతన్యం కలుగుతుంది…అందుకే అందరూ చదువుకోవాలి..దంతోనే రాజకీయ చైతన్యం,రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు కడియం. బడిఈడు పిల్లలు ఎవరు కూడ గోర్లు మేపేందుకు వెళ్లకుండా ప్రతి ఒక్కరు బడికి వెళ్ళాలే నేర్పించాలన్నారు. మరో వైపు ఇక్కడ ఏర్పటు చేసిన ఫ్లెక్సిల్లోనూ విభేదాలు పోటీ కనిపించింది.. కడియం ఉన్న ఫ్లెక్సీల్లో రాజయ్య లేదు రాజయ్య ఉన్న ఫ్లెక్సీల్లో కడియం లేరు.