Chit Fund Fraud: నగరంలో రోజురోజుకు పుట్టుకొస్తున్న కొన్ని చిట్ ఫండ్ కంపెనీలు వినియోగదారులను నిండా ముంచేస్తున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఏటా పదుల సంఖ్యలో చిట్ ఫండ్ కంపెనీలు ప్రారంభమవుతున్నాయి. దీంతో చిట్ ఫండ్ కంపెనీలను నమ్మి అమాయకులు బలి అవుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో ఓ చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు.
Read also: Rajiv Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళి..
అబిడ్స్ లోని తిలక్ రోడ్డులో ఆబిడ్స్ తిలక్ రోడ్డులో శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ పేరుతో చిట్‌ఫండ్ కార్యాలయం ఉంది. ఈ ఎంటర్ ప్తైజెస్ ను టెస్కాబ్ లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న వాణిబాల భర్త, కొడుకు కలిసి నడుపుతున్నారు. టెస్కాబ్‌కు వచ్చే డిపాజిట్ దారులను శ్రీ ప్రియాంక చిట్‌ఫ్ండ్ లో డిపాజిట్ చేయాలని వాణిబాల పంపించిన ప్రేరేపించేది. అంతే కాకుండా.. 15 నుంచి 18 శాతం వడ్డీ వస్తుందని వాణిబాల డిపాజిట్ దారులను నమ్మించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ లు వసూలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకులో జనరవ్ మేనేజర్ గా వాణిబాల ఉండటంతో ఆమెను నమ్మి కస్టమర్లు బారీగా డిపాజిట్ లు చేశారు. నేతాజీ, వర్షలు ఇద్దరు కలిసి చిట్‌ఫండ్స్ కార్యాలయాన్ని గత 20 ఏళ్ళుగా నడుపుతున్నారు.
Read also: Mahaboobnagar: మహబూబ్ నగర్ లో చికెన్ గున్యా కేసులు.. భయాందోళనలో ప్రజలు
గత జనవరి నుండి డిపాజిట్‌లకు వడ్డీలను నిలిపివేశారు. బాధితుల ఆందోళనతో చిట్‌ఫండ్ కార్యాలయానికి బయలు దేరారు. దీంతో కార్యాలయం తాళంతో కనిపించింది. టెస్కాబ్ జనరల్ మేనేజర్ వాణిబాల, ఆమె భర్త నేతాజి, కుమారుడు హర్షలు పరారీలో ఉన్నారు. సీసీఎస్ లో ఫిర్యాదు చేసిన బాధితులు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రంగప్రవేశం చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఈ నెల 31 వ తేదీన వాణి బాల రిటైర్మెంట్ కానున్నట్లు సమాచారం. కేసు నేపథ్యంలో టెస్కాబ్ వాణిబాలను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. చిట్ ఫండ్ పేరుతో ప్రజలు మోసపోవద్దని పోలీసులు సూచించారు. ఇటువంటి వారి పట్లు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Poll violence in AP: ఏపీలో అల్లర్లపై నేడు మరో నివేదిక ఇవ్వనున్న సిట్..