మాచర్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం.. పిన్నెల్లి సోదరులు సిద్ధమేనా? అంటూ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సవాల్ విసిరారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర ఉండి మరి ఈవీఎంలు ధ్వంసం చెపించాడు.. తాలిబన్ ముఠాలాగా మొహాలకు ముసుగులు ధరించి విధ్వంసం చేశారు.
మాచర్లలో జరిగిన ఘర్షణపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు.. అయితే, చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో బయటపడిందని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనే.. 7 హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బ్రహ్మా రెడ్డిని చంద్రబాబు ఎందుకు మాచర్లలో తెచ్చిపెట్టారు? అని ప్రశ్నించారు. మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారని ఆరోపించారు.. పిన్నెల్లి కుటుంబం రెండు దశాబ్దాలుగా రాజకీయంగా…
పల్నాడు జిల్లా మాచర్లలో తాజాగా జరిగిన హింసాత్మక ఘటనలు కలకలం సృష్టించాయి.. ఇక, ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇంఛార్జీ బ్రహ్మారెడ్డి సహా తొమ్మిదిపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.. ఇందులో ఏ-1గా బ్రహ్మారెడ్డిని పేర్కొన్నారు. అయితే, మాచర్లలో పరిస్థితులు, కేసులపై ఓ వీడియో విడుదల చేశారు మాచర్ల టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి.. టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసులో…
Kodali Nani: ఏపీలో పల్నాడు జిల్లా మాచర్ల రాజకీయాలు కాక రేపుతున్నాయి. మాచర్లలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ వాళ్లే దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాచర్ల ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. రాజకీయాల్లో గొడవలు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. ఇలాంటి గొడవలు మొదటిసారి కాదు.. చివరిసారి కూడా కాదన్నారు. బహిరంగ సభల్లో 75 ఏళ్ల చంద్రబాబు ప్రతిరోజూ వైసీపీ నేతలను బట్టలూడదీసి కొడతానని అంటున్నారని..…