తెలుగుదేశం నాయకుల హత్యలకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏంటి సంబంధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రహనించారు. హత్య జరిగిన ప్రాంతంలో దొరికిన స్కార్పియోపై జేబీఆర్ అని ఉందని.. జేబీఆర్ అంటే జూలకంటి బ్రహ్మారెడ్డి కానీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కాదన్నారు. హత్యకు గురైన వారి బంధువులు కూడా తెలుగుదేశం నాయకులే చంపారని చెప్పారని.. కానీ ఈ హత్యలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామి రెడ్డిని ఇరికించడం దారుణమన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతోనే…
మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై, ముఖ్యమంత్రి విచారణ చేయించాలని కోరారు. తప్పు చేసి ఉంటే తనను శిక్షించాలని ఆయన అన్నారు.
Julakanti Brahmananda Reddy Met Balakrishna: నందమూరి బాలకృష్ణ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పాలిటిక్స్ కూడా చేస్తున్న ఆయన ఈ మధ్యనే మూడవ సారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాతల మండలి ప్రతినిధులు నందమూరి బాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్‌కు బాలయ్య ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించినందుకు వారు శుభాకాంక్షలు తెలిపారు. మొన్న ఈమధ్యనే…
టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి ఆరోపణలపై స్పందించారు మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. తనపై బ్రహ్మనంద రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. మేము ఎటువంటి దాడులు చేయలేదని పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వెల్లడించారు.
మాచర్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు, అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం.. పిన్నెల్లి సోదరులు సిద్ధమేనా? అంటూ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సవాల్ విసిరారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర ఉండి మరి ఈవీఎంలు ధ్వంసం చెపించాడు.. తాలిబన్ ముఠాలాగా మొహాలకు ముసుగులు ధరించి విధ్వంసం చేశారు.
పల్నాడు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాచర్ల రణరంగంగా మారింది. మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పెద్దసంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని టీడీపీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.