మగువలకు మల్లెలు అంటే చాలా ఇష్టం.. ఆ వాసనలకు ఎలాంటి వారైనా సరే టెంప్ట్ అవుతారు.. ముత్తైదువు జడలో మల్లెపూలు మెరవాల్సిందే.. మాంచి పర్ఫ్యూమ్ తయారు చేయాలంటే మల్లెపూలు కావాల్సిందే. ఇలా మల్లెపూలు అలంకరణలోనే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ పూలకు మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంది.. అందుకే రైతులు ఎక్కువగా మల్లెపూలను సాగు చెయ్యడానికి రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ తోటలో పురుగు నివారణ చర్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సాధారణంగా మల్లెపూల మొక్కలను నాటిన రెండో ఏడాదిలో పూలను పూస్తాయి.. మల్లె మొగ్గ దశలో వివిధ రకాల పురుగులు ఆశించి పూల దిగుబడి నాణ్యతను పై తీవ్ర ప్రభావం చూపుతాయి. నాణ్యమైన మల్లెపూల దిగుబడి పొందడానికి కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.. అప్పుడే పూల దిగుబడి కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఎటువంటి పురుగులు ఆశిస్తాయి.. ఏం చెయ్యాలి ఇప్పుడు తెలుసుకుందాం..
మొగ్గ తొలుచు పురుగు: మల్లె మొగ్గ దశలో ఈ పురుగులు తీవ్రంగా నష్టపరుస్తాయి.తల్లి పురుగు మొగ్గలపై మొగ్గ కాడలపై గ్రుడ్లను పెట్టడం వల్ల ఈ పురుగు లార్వాలు మొగ్గలోకి చొచ్చుకొనిపోయి పూల భాగాలను తినడం వల్ల మొగ్గలు ఎండిపోయి రాలిపోతాయి. ఈ పురుగు నివారణకు మలాథియాన్ లేదా డైమిథోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.. అప్పుడే పురుగు ఉదృతి కూడా తగ్గుతుంది..
నల్లి : పొడి వాతావరణంలో నల్లి ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది.ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల మీద, లేత కొమ్మల మీద, మొగ్గలపై తెల్లటి వెంట్రుకలతో కూడిన మచ్చలు కనిపిస్తాయి. వీటి నివారణకు గంధకపు పొడిని ఎకరానికి 8-10 కిలోల చొప్పున చల్లితే మంచి లాభాలను పొందవచ్చు..
ఎండు తెగులు : ఈ తెగులు సోకిన మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి కోమ్మలు ఏంటి పోయి చివరికి మొక్క చనిపోతుంది.ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు , లీటరు నీటికి కలిపి మొక్కల పై పిచికారి చేస్తే మంచిది.. ఇంకా కొన్ని రకాల తెగుళ్లు కూడా సోకే ప్రమాదం ఉంది.. వాటిని గుర్తించి వెంటనే నివారణ చర్యలను తీసుకోవాలి..