తమిళ స్టార్ హీరో సూర్య బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘కర్ణ’ లో లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు.మహా భారతంలోని కర్ణుడి పాత్రను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.తాజాగా ‘కర్ణ’ మూవీకి సంబంధించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సూర్య సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ క్యూట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే చిత్రబృందం ఆమెను కాంటాక్ట్ చేసినట్లు సమాచారం. ప్రతిష్టాత్మక మూవీలో అవకాశం రావడంతో ఆమె కూడా ఓకే అన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పాన్ ఇండియా మూవీగా ‘కర్ణ’ తెరకెక్కనుంది.ఫర్హాన్ అక్తర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో చేయాలని దర్శకుడు రాకేష్ భావించినా, కొన్ని కారణాలతో ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో సూర్య హీరోగా నటించనున్నారు.ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న’దేవర’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాతో జాన్వీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు జాన్వీ మరో రెండు సినిమాలను చేస్తోంది. అందులో ఒకటి ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ కాగా, మరొకటి ‘ఉలాజ్’.అలాగే సూర్య రీసెంట్ గా ‘కంగువ’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్లు వెల్లడించారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ మూవీగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రూపొందుతోంది.