Pawan kalyan: ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అటు లోక్‌సభ స్థానంతో పాటు.. అసెంబ్లీ స్థానంలోనూ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది.. ఈ దశలో ఆయన ఎంపీగా బరిలోకి దిగాలనే యోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి.. అయితే, మొత్తంగా ఈ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఫైనల్ అయ్యింది.. స్వయంగా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అంతే కాదు.. నన్ను ఎంపీగా పోటీచేయాలని అంటున్నారు.. కానీ, నాకు ఎమ్మెల్యేగానే పోటీచేయాలని ఉంది.. ప్రస్తుతానికి ఎంపీగా పోటీచేయాలనే ఆలోచనలేదు అని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. మధ్య తరగతి వ్యక్తికి కోపం వచ్చి రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అనేదే జనసేన.. మధ్య తరగతి వర్గానికి వచ్చే కోపం నాతో జనసేన పార్టీ పెట్టించిందన్నారు.
Read Also: TSRTC: మరో కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం.. త్వరలో పార్శిళ్లు ఇంటి వద్దనే పికప్, డెలివరీ
ఇక, అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తుల వల్ల నాలో ఆలోచన రేపాయి అన్నారు పవన్.. నేను డిగ్రీ పూర్తి చేయలేదు.. చిరంజీవికి బాడీగార్డ్ గా బ్రతికేయాలి అనుకున్నా.. నాకు కష్టాలు లేవు నేనే కష్టాలు కొనితెచ్చుకున్నాను అన్నారు. చిరంజీవి పార్టీ పెడితే మీ కుటుంబం మీద దాడులు చేస్తామని 2006లో నాకు చెప్పారు.. వాళ్లంతా పదవుల్లో ఉన్నారని పేర్కొన్నారు. నేను ఏం చేసినా అన్నీ ఆలోచన చేసే చేస్తాను.. ఆశయం కోసం వచ్చిన నేను ఓడిపోతే శూన్యం అనిపించింది అన్నారు. కానీ, నేను అధికారం కోసం కాదు మార్పు కోసం వచ్చాను అన్నారు. వైఎస్ జగన్ మీద, ఆయన పార్టీ మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు.. వారి విధానాలు మాత్రమే నాకు నచ్చవు అన్నారు. రౌడీలు, రాజకీయ నాయకులు నాలాంటి వారిని చూడలేదు.. నన్ను కొట్టే ప్రతి దెబ్బను వాడుకుని నేను ఎదుగుతాను అన్నారు. వైసీపీ రోడ్లు వేయకపోతే నా కారు మాత్రమే కాదు అందరి కార్లు పనిచేయవు అన్నారు జనసేనాని.. నా అభిమానులు ఎక్కువ మంది వైసీపీకి ఓటు వేశారు అని గుర్తు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.