Pawan Kalyan: ఆ రెండు భావజాలాలు నాకు ఇష్టం.. ఒక తాటిపైకి తేవాలన్నదే నా ఉద్దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: సనాతన భావజాలం, లెఫ్ట్ భావజాలం అంటే ఇష్టం నాకు.. రెండూ ఒక తాటిపైకి తేవాలన్నది నా ఉద్దేశం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పార్టీ కండువా కప్పి వారిని జనసేనలోకి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ.. దాశరధి రంగాచార్య, కృష్ణమాచార్య కూడా సనాతన విధానాలు పాటించినా.. వామపక్ష విధానాలతో ఉద్యమించారని గుర్తుచేశారు.. 2019లో పార్టీలోకి ఇతర పార్టీ నాయకులను ఆహ్వానిస్తే ఈ ఎన్నికల్లో జనసేన ఇండిపెండెంట్ గా పోటీ చేసేది.. 2004, 2005 నుంచి నేను దళిత, బీసీ కులాల నాయకులతో తిరిగే వాడిని.. అధికారం చూడని కులాలకి నిజమైన సాధికారత ఇవ్వాలని ఆలోచించాను అని తెలిపారు.
Read Also: Janasena Party: వైసీపీకి షాక్..! పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన కీలక నేతలు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
బీసీ నేతలను మంత్రిని చేసి నిర్ణయాత్మక శక్తి లేకుండా చేయడం సాధికారత కాదన్నారు పవన్ కల్యాణ్.. వెనుకబడిన కులాలు ఒక నిర్ణయాత్మక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. ఒంటరితనం అనుభవించి, అవమానాలు పడ్డాను.. ప్రతికూల పరిస్ధితుల్లో పార్టీ పెట్టాను అని గుర్తు చేసుకున్నారు. ఒక కులాన్ని ఆధారం చేసుకుని పాలిటిక్స్ చేయలేం.. మూడో ఎన్నికకు వచ్చేసరికి భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ మారిపోయిందని గుర్తు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మన కులాన్ని మనం సంరక్షించుకుంటూనే.. మన పక్కన ఉన్న కులాలను కలుపుకు వెళ్ళాలి.. అని గద్దర్ చెప్పారు.. గొడవలకు కులాలను వాడతారు.. కానీ, ఎన్నికల్లో అది కనిపించదు అన్నారు. సామాజిక తెలంగాణ అని 2009లోనే చూపించేవాళ్లం.. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ ప్రభుత్వం వస్తుంది. నేను ఎవరికి కొమ్ము కాయను… నాయకులు ప్రతీరోజూ కొట్టుకుంటే.. కార్యకర్తలు తలలు పగులకొట్టుకుంటారు. ఏదో ఒక రోజు పవన్ కల్యాణ్‌ను దాటి కార్యకర్తల్లో ఒకరు జనసేనను నడపాలన్నారు.
Read Also: 800 The Movie: సైలెంటుగా ఓటీటీలోకి వచ్చేసిన ముత్తయ్య 800.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
దేవాలయాలకి డబ్బులు పంపమని తల్లి చెపితే.. జనసేనకు డబ్బులు పంపుతున్నాడు ఒకాయన.. నేను వ్యక్తులను ఎన్నుకునేప్పుడు కులాలను చూడను గుణగణాలు చూస్తా అన్నారు పవన్.. ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొంటూ అవినీతి గురించి మాట్లాడకూడదు.. రాజశేఖరరెడ్డి హయాంలోనే కోట్లు సంపాదన ఉన్నవాడిని నేను అని గుర్తు చేసుకున్నారు. నేను ఈగోలకు వెళ్లను, ఛాన్సులు తీసుకోదలచుకోలేదు.. ఏపీ ప్రజలు గెలవాలనుకుంటున్నాను.. విభజన సమయంలో పార్టీ నిలబడెట్టుకోలేకపోయాం.. పొలిటికల్ అలజడి అతలాకుతలం చేసిందన్నారు. తెలివి లేక, వ్యూహం వేయలేక పార్టీ నిలబెట్టుకోలేకపోయా.. పుస్తకం పట్టుకోలేని వాడు, నా దృష్టిలో పడాలని చూసిన వాడు ఎమ్మెల్యే అయ్యాడు.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నిలబెట్టుకో లేకపోయాం అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి జనసేన విస్తృత భావజాలం నచ్చిందని ఈ సందర్భంగా వెల్లడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!