Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ameesha Patel: ఇండస్ట్రీలో ప్రమోషన్ల పేరుతో సాగుతున్న మితిమీరిన ఆర్భాటాలపై బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ వాస్తవాలను మరిచి లేని స్టార్డమ్ భ్రమల్లో విహరిస్తున్నారంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే, ప్రమోషన్ల పేరిట నిర్మాతల జేబులు గుల్ల చేస్తూ హీరోయిన్లు చేసే ఖర్చులే ఎక్కువగా ఉంటాయంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ అమీషా పటేల్ సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణాన్ని నిర్భయంగా బయటపెట్టారు. చాలా మంది హీరోయిన్లు తమ అసలైన స్థాయి ఏంటో అంగీకరించే స్థితిలో లేరని ఆమె ఎద్దేవా చేశారు.
“స్టార్‌డమ్‌పై ఉండే భ్రమల్లోనే కాలం గడుపుతున్నారు. సినిమా ప్రమోషన్ల సమయంలో ప్రొడ్యూసర్ల ఖర్చుతో వీళ్లు చేసే హడావుడి, హంగామా చూస్తే విస్మయం కలుగుతుంది. వాళ్లు చేసే ఆ ప్రమోషన్స్ ఖర్చు.. ఆ సినిమా ఫస్ట్ డే రాబట్టే కలెక్షన్ల కంటే ఎక్కువగా ఉంటోంది. తెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ వాళ్లు అంతటి లగ్జరీ జీవితాన్ని నిజంగానే గడపాలని కోరుకుంటున్నా” అంటూ తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఆమె తన కామెంట్స్‌లో ఏ ఒక్కరి పేరునూ నేరుగా ప్రస్తావించకపోయినా, ప్రస్తుతం పీఆర్ హంగులతో హల్చల్ చేస్తున్న పలువురు ప్రముఖ హీరోయిన్లనే టార్గెట్ చేశారన్న గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. తన కెరీర్, సినిమాల ఎంపికపై కూడా అమీషా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చిందని రొటీన్‌గా ఉండే పది సినిమాలు చేసుకుంటూ పోయే కంటే, చరిత్ర సృష్టించే ‘గదర్’ లాంటి ఒక్క బ్లాక్‌బస్టర్ చేసినా చాలని ఆమె తన మనసులోని మాటలను పంచుకున్నారు. ప్రమోషన్స్ హంగామాతో బాక్సాఫీస్‌ను గెలవలేరని అమీషా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!