Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- సోనియాగాంధీకి కోర్టు షాక్
- పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
- గతంలో ఎఫ్ఐఆర్ నమోదుకు నిరాకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీకి న్యాయస్థానం షాకిచ్చింది. భారత పౌరసత్వంపై మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు. భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ జాబితాలో పేరు నమోదు కావడంపై ఢిల్లీ సెషన్స్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తూ మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సోమవారం సెషన్స్ కోర్టు కొట్టేసింది. దీంతో సోనియాగాంధీకి షాక్ తగిలినట్లైంది.
పిటిషన్‌పై మళ్లీ విచారణ
2025 సెప్టెంబర్‌లో మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తాజాగా సెషన్స్ కోర్టు జడ్జి విషా గోగ్నే కొట్టివేశారు. ఈ పిటిషన్‌ను తాజాగా మరోసారి విచారించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. పిటిషనర్ వికాస్ త్రిపాఠి, ఢిల్లీ పోలీసుల వాదనలు పూర్తిగా విన్న తర్వాత కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేయాలని మెజిస్ట్రేట్‌ను సూచించారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
అసలు పిటిషన్ ఎవరిది?
రౌస్ అవెన్యూ కోర్టుల సెంట్రల్ ఢిల్లీ కోర్ట్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, న్యాయవాది వికాస్ త్రిపాఠి ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై FIR నమోదు చేయాలని ఆయన కోరారు. మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపం ఉందని సెషన్స్ కోర్టు పేర్కొంది. ముఖ్యంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS)లోని సెక్షన్ 175(3) నిబంధనలను సరిగ్గా పాటించలేదని జడ్జి తెలిపారు. సంబంధిత పోలీసు అధికారి వాదనలు వినకపోవడం, పోలీస్ స్టేషన్ నుంచి స్టేటస్ రిపోర్ట్ తీసుకోకపోవడం వంటి అంశాలను కోర్టు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టి, ఫిర్యాదుపై చట్ట ప్రకారం మళ్లీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ సెషన్స్ కోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!