800 Movie Released in OTT: శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 2 నుంచి జియో సినిమా ఓటీటీలో ఈ బయోపిక్ మూవీ స్ట్రీమింగ్ కానుందని సినిమా యూనిట్ ప్రకటించినట్టుగానే ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో 800 రిలీజ్ అయింది. ఇక ఈ బయోపిక్‌లో ముత్తయ్య మురళీధన్ పాత్రలో స్లమ్ గాడ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా మహిమా నంబియార్ ఆయన భార్య పాత్రలో నటించింది. ఇక 800 మూవీకి శ్రీపతి ఎంఎస్ దర్శకత్వం వహించగా అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజై విమర్శకులతో పాటు క్రికెట్ అభిమానులను సైతం ఆకట్టుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి హిట్ గా నిలిచింది.
Rakul Preet Singh: స్టైలిష్ ఫోజులతో స్టన్నింగ్ లుక్స్ తో అట్ట్రాక్ట్ చేస్తున్న.. రకుల్ ప్రీత్ సింగ్
ముత్తయ్య మురళీధరన్ తండ్రి తన కొడుకును ఎలా క్రికెటర్‌గా తీర్చిదిద్దాడు? శ్రీలంకలో జరిగిన యుద్ధాల ప్రభావం మురళీధరన్‌పై ఎలా పడింది? క్రికెట్ ఆటలో తనకు ఎదురైన అవమానాల్ని దాటుకుంటూ నంబర్ వన్ బౌలర్ గా ముత్తయ్య మురళీధరన్ ఎలా అవతరించాడన్నది దర్శకుడు శ్రీపతి ఎమోషనల్‌గా ఈ 800 మూవీలో చూపించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సచిన్, మురళీధరన్‌తో పాటు పలువురు క్రికెటర్లు పాల్గొనడంతో బయోపిక్‌పై ముందు నుంచే మంచి హైప్ ఏర్పడింది. అయితే నిజానికి ముందుగా ఈ బయోపిక్‌ను విజయ్ సేతుపతితో తెరకెక్కించాలని దర్శకుడు భావించగా అందుకు సిద్దమై పిక్ కూడా షేర్ చేశారు. అయితే శ్రీలంకలో ఎంతో మంది తమిళులు చనిపోయినా మాట్లాడని వ్యక్తి పాత్రలో ఎలా నటిస్తారు అంటూ తమిళ ఆడియన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో విజయ్ సేతుపతి ఈ మూవీని నుంచి తప్పుకున్నాడు.