Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపించాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎమోషనల్ అండ్ మాస్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం థియేటర్లలోనే కాకుండా ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా సృష్టిస్తున్న విధ్వంసం చూసి ట్రేడ్ వర్గాలు సైతం అవాక్కవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద రవన్న ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉందో మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ. 250 కోట్లకు పైగా భారీ గ్రాస్ వసూళ్లు సాధించి రవితేజ కెరీర్లోనే మునుపెన్నడూ లేని హిస్టారిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కేవలం ఒక కమర్షియల్ సినిమాగా మాత్రమే కాకుండా.. తరతరాలను కదిలించిన కథగా, ప్రేక్షకులందరినీ భావోద్వేగంతో ఒక్కతాటిపైకి తెచ్చిన ‘జనరేషనల్ బ్లాక్ బస్టర్’గా ఈ సినిమా రికార్డులకెక్కింది.
థియేటర్లలో స్క్రీన్ కు ఆవల కూడా ఒక గొప్ప సెలబ్రేషన్ లా నిలిచిన ‘ఇరుముడి’, భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందని చెప్పాలి. థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ తన తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix India)లో స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే ‘ఇరుముడి’.. ఇండియా వైడ్‌గా ఏకంగా నంబర్ వన్ (#1) పొజిషన్లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రేక్షకులు ఎగబడుతున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ప్రాణం పోసిన సంగీతం, శివ నిర్వాణ ఎమోషనల్ టేకింగ్.. వీటన్నింటికీ మించి రవితేజ మాస్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. మొత్తానికి అటు సిల్వర్ స్క్రీన్ మీద రూ. 250 కోట్ల సెన్సేషన్తో, ఇటు నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్ ట్రెండింగ్‌తో మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ వేట ఏ స్థాయిలో ఉందో ‘ఇరుముడి’ నిరూపించింది.
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!