Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో వస్తున్న ‘రాకా’ (Raaka) మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ రేంజ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా భారీ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఏకంగా ప్రతిష్టాత్మక ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ (Guinness World Records) దక్కించుకుని యావత్ భారతీయ సినీ పరిశ్రమను విస్మయానికి గురిచేస్తోంది. అసలు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అనగానే అందరికీ భారీ హాలీవుడ్ చిత్రాలు మాత్రమే గుర్తొస్తాయి. అయితే టెక్నాలజీ పరంగా సరికొత్త బౌండరీలు బ్రేక్ చేస్తూ.. ‘రాకా’ మూవీ ఏకంగా “ఎక్కువ మంది పెర్ఫార్మర్లను రియల్ టైమ్‌లో ఏకకాలంలో మోషన్ క్యాప్చర్ చేసిన” (Most People Motion-Captured in Real-Time) చిత్రంగా సంచలన రికార్డును నెలకొల్పింది. ఈ సినిమా కోసం ఒకేసారి ఏకంగా 37 మంది పెర్ఫార్మర్లను లైవ్ మోషన్ క్యాప్చర్ ద్వారా బంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తమ పేరు లిఖించుకున్నారు. ఈ సినిమా విజువల్స్ పట్ల మేకర్స్ పెడుతున్న ఎఫర్ట్, వాడుతున్న టెక్నాలజీ ఏ స్థాయిలో ఉన్నాయో ఈ అరుదైన ఘనతే చెబుతోంది.
ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తింపుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధుల నుంచి హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ స్వయంగా ఆ ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈవెంట్ వేదికపై.. అల్లు అర్జున్, అట్లీ గర్వంగా గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ పట్టుకుని నిల్చున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం పాన్ ఇండియా సినిమాగా మాత్రమే కాకుండా ఒక గ్లోబల్ మాస్టర్ పీస్ లా రూపొందుతున్న ఈ చిత్రం.. రిలీజ్‌కు ముందే ఇలాంటి రికార్డులతో దుమ్మురేపుతుండటంతో ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గ్లోబల్ స్థాయిలో మొదలైన ఈ ‘రాకా’ ప్రభంజనం ముందుముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!