Jalsa vs Murari: డిసెంబర్ 31న న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన యాక్షన్–కామెడీ చిత్రం ‘జల్సా’, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సూపర్ న్యాచురల్ డ్రామా ‘మురారి’ 4K వెర్షన్‌లో థియేటర్లలో రీరిలీజ్ అవుతున్నాయి. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఈ రెండు సినిమాలకు భారీ స్పందన కనిపిస్తోంది. బుక్ మై షోలో గత 24 గంటల్లోనే ‘జల్సా’ 8,000కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అలాగే 31,000కు పైగా ఓట్లతో 9.8/10 రేటింగ్ సాధించింది. ఆల్ ఇండియా స్థాయిలో ఇప్పటికే సుమారు రూ.25 లక్షల గ్రాస్ వసూలు చేసిందంటే నమ్మండి.
Best Budget Phones: 2026లో రూ. 15,000 లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..!
మరోవైపు ‘మురారి’ కూడా తగ్గేదే లేదు అన్నటుగా.. 9.7/10 రేటింగ్‌తో 5,000కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక్కో షోకు సగటున 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు అవుతోంది. రూ.100 లోపు టికెట్లు అందుబాటులో ఉండటంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. 2026కు ముందే తమ అభిమాన హీరోల క్రేజ్ ఇంకా తగ్గలేదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హైప్ పెంచుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు ఈ రీరిలీజ్‌లు అభిమానుల్లో హుషారు తీసుకరానున్నాయి.