ఈరోజుల్లో ఎవరు ఎలాంటి వారో చెప్పడం చాలా కష్టం.. అమాయికులుగా ఉంటూనే రాక్షసులుగా ప్రవర్తిస్తుంటారు.. పైన పటారం లోన లోటారం అనే సామెతకు తగ్గట్లు ఉంటారు.. అలాంటి వాళ్ళు ఇంట్లో నిజస్వరూపాన్ని చూపిస్తున్నారు.. కుటుంబ సభ్యులతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు..తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీలో జరిగింది.. భార్యను శారీరకంగా, మానసికంగా క్షోభకు గురించేస్తున్నాడు..పోర్న్ వీడియోలను చూస్తూ కాలం గడుపుతున్న భర్త భార్యకు నరకం చూపిస్తూ వస్తున్నాడు.. ఓ ప్రబుద్దుడు తన భార్యను అలాగే తనతో సెక్స్ చేయాలంటూ వేధించేవాడు. అంతటితో ఆగకుండా అతడి శాడిజం మరింత పీక్స్‌కు చేరింది.. ఆ బాధలు భరించలేక అత్త మామలకు చెబితే వాళ్ళు కొడుక్కు బుద్ది చెప్పాల్సింది పోయి దారుణంగా ప్రవర్తించారు.. దాన్ని తట్టుకోలేక ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.. దాంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..
వివరాల్లోకి వెళితే…ఢిల్లీలోని ఈస్ట్ రోహ్తాష్ నగర్‌కు చెందిన ఓ యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో 2020లో వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో అతడు.. అందరిలానే నార్మల్‌గా ఉన్నాడు. అయితే రానురానూ సదరు యువకుడికి ప్రవర్తనలో మార్పులు రావడం ప్రారంభమయ్యాయి. క్రమేపీ శాడిస్టులా మారిపోయాడు. నిత్యం ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ.. వాటికి అడిక్ట్ అయ్యి..అలానే భార్యను కూడా చెయ్యాలని బలవంతం పెట్టేవాడు..ఆ అశ్లీల వీడియోలలో మహిళల మాదిరిగా దుస్తులు వేసుకోవాలని చెబుతూ టార్చర్ చేయసాగాడు..
ఆ విషయం అతని తల్లి, దండ్రులకు చెప్పడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది..కొడుక్కి బుద్ది చెప్పాల్సిన తల్లిదండ్రులు.. అతడికి వత్తాసు పలుకుతూ.. కోడల్ని ఇంకా వేధింపులకు గురి చేశారు. అదనపు కట్నం తీసుకురావాలంటూ కొట్టేవారు కూడా. దీంతో ఆ వేధింపులు తాళలేకపోయిన యువతి.. చివరికి పోలీసులను ఆశ్రయించింది.. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది.. ఆమె వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న వారు ఆమె భర్తను, అత్త మామాలను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.. మరోవైపు ఆ మహిళ విడాకులకు అప్లై చేసుకుందని సమాచారం.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..