YS Jagan: కూటమి ప్రభుత్వానికి జగన్ సూటి ప్రశ్నలు
- సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేసిన జగన్ మోహన్ రెడ్డి
- కూటమి ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నించిన జగన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ వైయస్సార్‌సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా ఆయన కూటమి సర్కార్‌ను నిలదీస్తూ తన సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ సందేశాన్ని తెలిపారు. ఇక ఆ సందేశంలో పలు అంశాలపై సూటిగా ప్రశ్నించారు. ఇందులో ఏముందంటే..
చంద్రబాబు నాయుడు గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అని సూటిగా ప్రశ్నించారు. మీ పార్టీ అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. కానీ, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని కూడా ఆపేశారని జగన్ అన్నారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నా కానీ, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో కచ్చితంగా చెప్పలేదంటూ తెలిపారు. చివరికి, ఈ ఏడాదికి అసలు ఇవ్వమని కేబినెట్ లో తేల్చిచెప్పేశారని, ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? అంటూ జగన్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
Also Read: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఒక్కరోజే 15 వికెట్లు
ఇక ముఖ్యంగా ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదని, ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు.. అన్నారని.. ఇద్దరుంటే రూ.30వేలు.. ముగ్గురు ఉంటే రూ.45వేలు.. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారని జగన్ తెలిపారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే పిల్లలు, వారి తల్లులు ఈ 7-8 నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారని జగన్ అన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లుతూ.. ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారన్నారంటూ మండి పడ్డారు.
మరోవైపు, రైతు భరోసా తీరు కూడా అలాగే ఉందని.. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా డబ్బులు ఇవ్వకుండా గడిపేశారని అన్నారు. అదిగో.. ఇదిగో.. అంటూ లీకులు ఇస్తున్నారు కానీ, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదని జగన్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ. 20వేలు ఇస్తామన్నారని, ఇప్పుడు ఖరీఫ్ అయిపోయింది.. రబీ కూడా అయిపోయింది.. ఒక్కపైసా ఇవ్వలేదని అని జగన్ అన్నారు. సంక్షోభం సమయంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే కనీసం వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదుకదా.. కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదని టీడీపీ ప్రభుత్వంపై జగన్ విమర్శలు గుప్పించారు.
Also Read: Kakani Govardhan Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామంటున్న మాజీ మంత్రి
1.@ncbn గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?
2.అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 4, 2025
మొత్తంగా.. ప్రతి పిల్లాడికి రూ. 15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే.. అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ. 20వేలు ఇస్తామన్నది మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ. 18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ. 36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48 వేలు మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది కూడా మోసమే అంటూ జగన్ ఫైర్ అయ్యారు. ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోందని, ప్రతి అడుగులోనూ స్కాంలే అని జగన్ అన్నారు. రోజులు గడుస్తున్నకొద్దీ, కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయని, ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయని ఆయన అన్నారు. ఓ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్‌సీపీ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుందని తెలిపారు. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరఫున నిలబడుతుందని ఆయన తన సుదీర్ఘ పోస్టులో తెలిపారు.
తాజావార్తలు
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!