Jabardasth Nookaraju: కన్నడంలో చిన్న సినిమాగా విడుదలైన కాంతార.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. సినిమాను రూ.18కోట్లతో నిర్మిస్తే ఇప్పుడు దాదాపు రూ.400కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇంకా కాంతార జోరు కొనసాగుతోనే ఉంది. భాషతో సంబంధం లేకుండా అందరి మనసులు గెలుచుకుని రికార్డుల దిశగా దూసుకుపోతుంది కాంతార. అందులో నటించిన రిషబ్ శెట్టి నటనకు యావత్ ప్రపంచం ఫిదా అయిపోయింది. రిషబ్ శెట్టి నటనకు ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులు అయిపోయారు. విమర్శకులు సైతం రిషబ్ శెట్టి నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also: Chiyaan Vikram: చియాన్ విక్రమ్‌కు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన నటి పూర్ణ
అయితే ఇక సినిమా చివర్లో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లో రిషబ్ శెట్టి దేవుడు పూనిన సమయంలో చేసే నటన.. చూపించే హవ భావాలు అందరిని కట్టిపడేస్తూ ఉంటాయి. రిషబ్ శెట్టి లో ఇంత గొప్ప నటుడు దాగి ఉన్నాడా అనే ప్రతి ఒక్కరి ప్రేక్షకుడిలో ఆలోచన వచ్చేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో సినిమాల్లో ఉన్న కొన్ని సన్నివేశాలను బుల్లితెర కార్యక్రమాల్లో స్పూఫ్ చేస్తున్నారు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలో కాంతార క్లైమాక్స్ ఎలిమెంట్ ను జబర్దస్త్ కమెడియన్ నూకరాజు ఏకంగా రిషబ్ శెట్టి పాత్ర పోషించి పర్ఫామెన్స్ చేశాడు. ఏకంగా రిషబ్ శెట్టి తరహాలోనే నూకరాజు హావభావాలు పండించిన తీరు చూసిన అభిమానులు షాక్ అయ్యారు.. నూకరాజులో ఇంత గొప్ప నటుడు దాగి ఉన్నాడా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక నూకరాజు పర్ఫామెన్స్ చూస్తే అచ్చం సినిమా చూసిన ఫీల్ వస్తుందంటున్నారు.