బుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న కామెడీ షో జబర్దస్త్… ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు.. కొందరు సినిమాల్లో అవకాశాలు అందుకుంటే.. మరికొందరు మాత్రం సినిమాలకు దర్శక, నిర్మాతలు కొనసాగుతున్నారు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్ లలో ఒకరే జబర్దస్త్ రోహిణి.. మొదట్లో సీరియల్స్ లో నటించిన ఈమె పెద్దగా పాపులారిటీ కాలేదు.. కానీ జబర్దస్త్ షోలోకి వచ్చిన వెంటనే భారీ క్రేజీని అందుకుంది..
ఇలాంటి పాపులారిటీతోనే మత్తు వదలరా ,బలగం వంటి సినిమాలతో పాటు పలు రకాల వెబ్ సిరీస్లలో నటిస్తూ అడపా దడపా సినిమాలలో నటిస్తోంది. రోహిణి పంచులకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..బిగ్ బాస్-3 వ సీజన్లో పాల్గొనింది. ఇప్పుడు తాజాగా రోహిణి ఒక కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది.. మొదట కొన్న కారు యాక్సిడెంట్లు దెబ్బతిందని రెండో కారు ఈ మధ్యనే అమ్మేశారని ఇప్పుడు ముచ్చటగా మూడవ కారుని కొన్నట్లు తెలియజేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
మొదటి కారు 9 లక్షలు పెట్టి కొన్నాను.. రెండో కారు 14 లక్షలు పెట్టి కొన్నాను ఇప్పుడు ఈ కారు రూ .25 లక్షల రూపాయలు పెట్టి తీసుకున్నాను అంటూ తెలిపింది.. వాస్తవానికి ఈమె ఆడి కారు కొనాలనుకుందట. కానీ దాని ధర 57 లక్షల దాకా ఉందని.. లోన్ పెట్టి తీసుకోవాలనుకున్నాను.. అయితే ఇండస్ట్రీలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు కానీ అని ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిపింది.. మొత్తానికి కొత్త కారును రోహిణి కొనేసింది.. ఆ కారుతో దిగిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..