Venky Re Release: టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పాత సినిమాలను 4k ప్రింట్లతో మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రీ రిలీజ్ లను కూడా అభిమానులు కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నంత గ్రాండ్ గా హంగామా చేయడం మాత్రం విశేషం. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరో ఆ సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా ఈ రీ రిలీజ్ ట్రెండ్ లిస్ట్ లో మరో సినిమా యాడ్ అయ్యింది. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన వెంకీ సినిమా రీ రిలీజ్ కు సిద్దమయ్యింది. ఉదయం లేచిన దగ్గరనుంచి పడుకోబోయేవరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక మీమ్ అయినా చూడకపోతే నిద్రపట్టదు. అంత ఫేమస్ ఈ సినిమా. ముఖ్యంగా బ్రహ్మి, ఏవీఎస్, రవితేజ, వేణు మాధవ్ ట్రైన్ కామెడీ అయితే వేరే లెవెల్ అంతే.
Narne Nithin: బావ ఎన్టీఆర్ సపోర్ట్ అవసరం లేదంటున్న బామ్మర్ది.. ?
శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన స్నేహ నటించింది. 2004 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాను అభిమానుల కోరిక మేరకు డిసెంబర్ 30 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ట్రైన్ సీన్ కోసం థియేటర్ కు వెళ్లాలని చెప్పుకొస్తున్నారు. ఇక కామెడీతో థియేటర్స్ లో సీట్లు చింపేస్తారేమో చూసుకోండి అంటూ థియేటర్స్ యాజమాన్యానికి అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.