తమన్నా..ఈ భామ ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉంది. వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా ఉంది. తమిళ్, తెలుగు, మరియు హిందీ భాషలలో వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. తమన్నా మొదటి సారి తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించింది. రజనీకాంత్ నటిస్తున్న పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ విడుదలకు రెడీ గా ఉంది..ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీన ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు..దీనితో ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘నువ్వు కావాలయ్యా’ సాంగ్ బాగా ట్రెండింగ్ గా మారింది. ఈ సాంగ్ లో తమన్నా హాట్ గా కనిపిస్తూ డాన్స్ ఇరగదీసింది.జైలర్ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ మరియు సునీల్ వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు.. ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి.
తమన్నా తెలుగులో చిరంజీవికి సరసన భోళాశంకర్ సినిమాలో చేసింది. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.జైలర్ సినిమా విడుదల అయినా తరువాత రోజే అంటే ఆగస్టు 11 వ తేదీన విడుదల కాబోతుంది. తమన్నా ఈ చిత్రంతో రెండవసారి చిరంజీవితో కలిసి నటించింది.. మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు చెల్లెలి పాత్రలో నటించింది.ఈ రెండు భారీ సినిమాలు భారీ విజయం సాధిస్తే తమన్నాకు మళ్ళీ వరుస అవకాశాలు వస్తాయి.ఇటీవల జీ కర్దా మరియు లస్ట్ స్టోరీస్ 2 వంటి వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించి మెప్పించింది ఈ భామ. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా హాట్ ఫోటో షూట్ తో రెచ్చగొట్టింది. కోట్ బటన్స్ విప్పేసి హాట్ షో చేసింది.తమన్నా వరుసగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ రెచ్చగొడుతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.