టాలీవుడ్ నిర్మాతల మీద జరిగిన ఐటీ రైడ్స్ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దిల్ రాజు ఈ అంశం మీద మీడియా ముందుకు వచ్చారు. ఐటీ సోదాలు అనేది కామన్ అని పేర్కొన్న దిల్ రాజు ఐటీ రైడ్స్ జరిపి అకౌంట్ బుక్స్ చెక్ చేసి స్టేట్‌మెంట్ తీసుకున్నారని అన్నారు. ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారని అన్నారు. ఐటీ రెయిడ్స్ జరిగినప్పుడు మా దగ్గర రూ.20 లక్షలు ఉన్నాయి అని పేర్కొన్న ఆయన వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సాధారణం అని అన్నారు.. నా దగ్గర డబ్బు కానీ ఆస్తుల పత్రాలు దొరకలేదు..అని నా దగ్గర ఐదు లక్షలు కూతురింట్లో ఆరు లక్షలు, శిరీష్ దగ్గర నాలుగున్నర లక్షలు క్యాష్ రూపంలో తీసుకున్నారు. కుటుంబం మొత్తంలో 20 లక్షలు మాత్రమే దొరికాయని పేర్కొన్న ఆయన ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదని అన్నారు.
Manchu Vishnu: టాలీవుడ్‌లో నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..
మా వ్యాపార లావా దేవీల సంబంధించినంత సమాచారం తీసుకున్నారని పెర్కున్నా ఆయన మా ఇంట్లో జరిగిన రైడ్స్ అనంతరం సమాచారం చూసి అధికారులే పూర్తిస్థాయిలో హ్యాపీగా ఉన్నారని అన్నారు. ఇక తన తల్లికి దగ్గు జలుబు ఎక్కువయింది.. దీంతో ఆస్పత్రి పంపించామని, ప్రస్తుతానికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నామని అన్నారు. 2008లో ఒకసారి నాపై ఇన్కమ్ టాక్స్ దాడి జరిగిందని, 16 ఏళ్ల తర్వాత మరొకసారి సోదాలు చేశారు. మొత్తం మూడుసార్లు ఐటి చెకింగ్ చేశారు, మా కుటుంబం మొత్తం మీద కూడా సోదాలు చేశారు, నిన్న కార్యాలయంలో సోదాలు ముగించారని అన్నారు. ఇక ఫిబ్రవరి మూడో తేదీన తమ ఎదుట హాజరుకావాలని ఐటీ నోటీస్ ఇచ్చిందని, ఈ మేరకు ఐటీ ఎదుట హాజరు కాబోతున్నానని అన్నారు.