ప్రపంచ మంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి తిరిగి రావడమే. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనున్నది. సునీతా రాకకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి తీసుకురావడానికి ప్రయోగించిన క్రూ డ్రాగన్ (స్పేస్‌క్రాఫ్ట్) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించింది. డాకింగ్ ప్రక్రియ కూడా ఈరోజు (మార్చి 16) పూర్తయింది. అన్నీ అనుకూలిస్తే ఇద్దరూ మార్చి 19న భూమికి…
బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారతీయురాలు సునీతా విలియమ్స్ ఇంకా కొంత కాలం పాటు అక్కడే ఉండాల్సి రావచ్చు. ఈ మిషన్ ను రూపొందించినప్పుడు తక్కువ రోజులే ఉంటుందని వెల్లడించారు.
చంద్రయాన్-3 మిషన్ కీలకమైన మరో ఆపరేషన్‌ను సక్సెస్ ఫుల్ గా కాంప్లీట్ చేసింది. మరోమారు స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య విన్యాసానాన్ని 174 కిలో మీటర్ల బై 1437 కిలో మీటర్లకు తగ్గించినట్టు ఇస్రో ప్రకటించింది.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రయాన్-3 ప్రయోగం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. చంద్రమండలంపై పరిశోధన కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి దిశగా ప్రయాణించే కక్ష్యలోకి చేరింది.
అంతరిక్ష పరిశోధనలో పశ్చిమ దేశాలతో పోటీ పడుతున్న చైనా మరో ముందడుగు వేసింది. దేశాల మధ్య అంతరిక్ష పోటీ పెరుగుతున్న నేపథ్యంలో చంద్రుడిపై శాస్త్రీయ అన్వేషణ కోసం 2030 నాటికి మానవ సహిత మిషన్‌ను పంపాలని డ్రాగన్ భావిస్తోంది. చంద్రునిపై పరిశోధనలు చేయడానికి 2030లో వ్యోమగాములను పంపనున్నట్లు చైనా సోమవారం ప్రకటించింది.
నాసా ఓ సరికొత్త ప్రయోగం చేయబోతున్నది. ఈనెల 23 వ తేదీన అంతరిక్షలంలోకి ఓ వ్యోమనౌకను ప్రయోగించబోతున్నది. ఈ వ్యోమనౌక విశ్వంలో ప్రయాణించే గ్రహశకలాన్ని ఢీకొడుతుంది. డిమోర్ఫాస్, డిడైమోస్ అనే గ్రహశకలాలను ఢీకొట్టేందుకు ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. ఈ గ్రహశకలాలు భూమికి కోటి పదిలక్షల మైళ్ల దూరంలో ఉన్నాయి. దీనిని చేరుకోవడానికి వ్యోమనౌకకు సవంత్సరం సమయం పడుతుంది. భవిష్యత్తులో ఈ గ్రహశకలాల నుంచి భూమికి ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. Read: వండర్:…