Sajjanar: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. ట్వీట్ చేసిన ఎండీ సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjanar: సోషల్ మీడియాలో వైరల్ కావడడానికి చాలామంది రకరకాల వీడియోలు చేస్తుంటారు. లైక్ ల కోసం నానా తిప్పలు పడుతుంటారు. కొందరు ఒక బైక్ పై కూర్చుని చేసిన వెకిలి చేష్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా బైక్‌పై ఒకరు లేదా ఇద్దరు ప్రయాణిస్తారు. అయితే ఇద్దరు పిల్లలతో కలిసి నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న సందర్భాలు ఉన్నాయి. వారు ఇంతకంటే ఎక్కువ చేస్తారు, కానీ మీరు ఎప్పుడైనా ఏడుగురు కలిసి ప్రయాణించడం చూశారా? ఇది ఎలా సాధ్యమవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అటువంటి జాతి రత్నాలు అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఏడుగురు యువకులు ఒకే బైక్‌పై తిరుగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read also: Thursday Remedies: గురువారం నాడు ఈ నివారణలు చేస్తే.. ఊహించని డబ్బు మీ సొంతం!
Also Read
ఓ బాలుడు బైక్‌పై వెళ్తుండగా.. మరొకరు ఎదురుగా ఉన్న పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చున్నారు. బైక్ రైడర్ వెనుక నలుగురు తెలివైన వ్యక్తులు కూర్చున్నారు. వారితో పాటు ఆరుగురు..చివరివాడి భుజాలపై కూర్చొని.. గాలిలో ప్రయాణిస్తున్నట్లుగా అనిపిస్తుంది. సరే.. ఇంత మంది ఒకే బైక్‌పై వెళ్తున్నారు.. కనీసం మెల్లగా వెళ్లకుండా.. స్పీడ్‌గా వెళ్తున్నారు. ఇదంతా ఒకటైతే.. వారంతా 18 ఏళ్ల లోపు వారే కనిపించడం మరో విశేషం. అదే దారిలో ప్రయాణిస్తున్న కారులోని ఓ వ్యక్తి ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అది వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు ప్రమాదకరమని సజ్జనార్ రాశారు. ఏ మాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని హెచ్చరించారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదని సూచించారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది బైక్‌లపై వెళ్లడం చట్ట విరుద్ధమని సజ్జనార్ సూచించారు. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ జిల్లాలో జరిగిందీ సంఘటన. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దమని సజ్జనార్ ట్విట్ చేశారు.
ఒక్క బైక్‌పై ఏడుగురు ప్రయాణమా?
ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ జిల్లాలో జరిగిందీ సంఘటన. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం… pic.twitter.com/O9f6Ll7ekf
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 9, 2023
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!