Volodymyr Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడి హతమార్చేందుకు యత్నం.. చివరకు ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ కీలక విషయాన్ని వెల్లడించింది. గత కొన్ని నెలలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల్లో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందేంటంటే.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ సహా మరికొందరు సైనిక అధికారులు, రాజకీయ నేతలను హతమార్చేందుకు రష్యా పన్నిన కుట్రను తాము భగ్నం చేశామని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో తన వ్యక్తిగత రక్షణను పర్యవేక్షించే విభాగాధిపతి(బాడీగార్డ్ చీఫ్)ను అధ్యక్షుడు తొలగించారు. స్టేట్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ అధిపతి సెర్గియ్ లియోనిడోవిచ్ రుడ్‌ను తొలగించినట్లు పేర్కొన్నారు. ఆయన్ను తప్పించడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. కొద్దిరోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ కుట్రకు సంబంధించి స్టేట్ గార్డ్ విభాగానికి చెందిన ఇద్దరు కర్నల్స్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ పన్నిన హత్యా ప్రణాళిక అమలులో వారి పాత్ర అనుమానాస్పదంగా ఉందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాగా.. గతంలోనూ జెలెన్‌స్కీ ని హతమార్చేందుకు రష్యా పలుమార్లు కుట్ర పన్నినట్లు పేర్కొంది. మరోపక్క.. పుతిన్ ప్రభుత్వం తన వాంటెడ్ లిస్ట్‌లో జెలెన్‌స్కీ పేరును చేర్చింది. నేరాభియోగాలు ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు. ఆయన పేరు కొన్ని నెలలుగా జాబితాలో ఉన్నప్పటికీ.. ఆ సంగతి ఇప్పుడే వెలుగులోకి వచ్చిందని ఇటీవల రష్యా మీడియాలో వార్తలొచ్చాయి. ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరమైన ఖర్కివ్‌పై రష్యా కన్నేసింది. ఈ నగరాన్ని ఆక్రమించే దిశగా ముందుకు సాగుతోంది. ఖర్కివ్ సరిహద్దుల్లోని ఐదు గ్రామాలను ఇప్పటికే ఆక్రమించింది. సుమారు 1800 మంది పౌరులను ఆ గ్రామాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దుల్లో భారీస్థాయిలో పోరు జరుగుతోందని, ఐదు గ్రామాలను మాస్కో ఆక్రమించడంతో ఆ ప్రాంతానికి అదనపు దళాలను పంపినట్లు కీవ్ పేర్కొంది. బెల్‌గరోద్‌పై ఉక్రెయిన్ నేరుగా దాడి చేయకుండా నిరోధించేందుకు ఖర్కివ్ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటు చేసుకోవడానికి రష్యా సైన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!