Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
- పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
- అమెరికా-ఇరాన్ పరస్పర వార్నింగ్‌లు
- మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు
- ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యేటట్టు కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్-అమెరికా మధ్య పంచాయితీ తెగడం లేదు. దీంతో రెండు దేశాలు హెచ్చరికలు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాకు ఇరాన్ తీవ్ర వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించింది. ఆ ఆయుధం పేరెత్తగానే శత్రు బలగాలు తీవ్రంగా భయపడుతున్నాయని.. గుండెపోటు కూడా తెప్పించగలదన్నారు.
హార్ముజ్ జలసంధిపై దిగ్బంధం ఎత్తేస్తే చర్చలు జరుపుతామని ఇరాన్ వెల్లడించింది. ఈ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. ముందు అణు ఒప్పందం చేసుకుంటేనే దిగ్బంధం ఎత్తేస్తానని.. లేదంటే నిరవధికంగా దిగ్బంధం కొనసాగుతుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి.
Also Read
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌కు మమ్దానీ విజ్ఞప్తి!
- Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..
ఇరాన్ నౌకాదళాధికారి రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ.. శత్రువులు భయపడే కొత్త ఆయుధాన్ని త్వరలోనే ఉపయోగిస్తామని తెలిపారు. ‘‘ఆ ఆయుధం వాళ్ల దగ్గరే ఉంది.. చూస్తే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంటుంది.’’ అని వ్యాఖ్యానించారు.
అమెరికా నౌకపై క్షిపణి దాడులు?
అమెరికా విమాన వాహక నౌక యూఎస్ అబ్రహం లింకన్ నౌకపై కనీసం ఏడు క్షిపణి దాడులు జరిపినట్లు తెలిపారు. దీంతో కొంతకాలం అమెరికా వైమానిక కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయని పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలో 100కి పైగా దాడులు నిర్వహించినట్లు ఇరాన్ పేర్కొంది. అలాగే శత్రు దేశాల నౌకలకు హార్ముజ్ మార్గాన్ని మూసివేసినట్లు వెల్లడించింది. ఇక అమెరికా చర్యలను “పైరసీ”గా పేర్కొంటూ ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది. “సోమాలియా దొంగల కంటే అమెరికా చెడ్డది” అంటూ వ్యాఖ్యానించింది. ఇరాన్ నౌకలను అక్రమంగా స్వాధీనం చేసుకుని.. సిబ్బందిని బంధించారని ఆరోపించింది.
తాజాగా ట్రంప్ మాట్లాడుతూ హార్ముజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందం చేసుకునేంత వరకు హార్ముజ్ జలసంధిపై విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయబోమని తేల్చి చెప్పారు. ముందు దిగ్బంధం ఎత్తేస్తేనే అణు ఒప్పందంపై చర్చిస్తామన్న ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ ముందు తగిన విధంగా అణు ఒప్పందం చేసుకుంటనే దిగ్బంధాన్ని ఎత్తివేస్తామని.. లేదంటే దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ పరిణామాలు చూస్తుంటే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా, భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Freezer Ice Smell Solution: ఫ్రీజర్‌లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
-
Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!