Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
- పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
- అమెరికా-ఇరాన్ పరస్పర వార్నింగ్‌లు
- మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు
- ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమయ్యేటట్టు కనిపిస్తోంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్-అమెరికా మధ్య పంచాయితీ తెగడం లేదు. దీంతో రెండు దేశాలు హెచ్చరికలు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాకు ఇరాన్ తీవ్ర వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించింది. ఆ ఆయుధం పేరెత్తగానే శత్రు బలగాలు తీవ్రంగా భయపడుతున్నాయని.. గుండెపోటు కూడా తెప్పించగలదన్నారు.
హార్ముజ్ జలసంధిపై దిగ్బంధం ఎత్తేస్తే చర్చలు జరుపుతామని ఇరాన్ వెల్లడించింది. ఈ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. ముందు అణు ఒప్పందం చేసుకుంటేనే దిగ్బంధం ఎత్తేస్తానని.. లేదంటే నిరవధికంగా దిగ్బంధం కొనసాగుతుందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి.
Also Read
- Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు 'ఆర్డర్ ఆఫ్ జాయెద్ II' ప్రదానం
- Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
- Saudi Houthi deal: శాంతి కోసం రూ. 9500 కోట్లు.. హౌతీలతో సౌదీ డీల్.?
- Shehbaz Sharif: "కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది".. పాక్ ప్రధాని ఆరోపణలు.!
ఇరాన్ నౌకాదళాధికారి రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ.. శత్రువులు భయపడే కొత్త ఆయుధాన్ని త్వరలోనే ఉపయోగిస్తామని తెలిపారు. ‘‘ఆ ఆయుధం వాళ్ల దగ్గరే ఉంది.. చూస్తే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంటుంది.’’ అని వ్యాఖ్యానించారు.
అమెరికా నౌకపై క్షిపణి దాడులు?
అమెరికా విమాన వాహక నౌక యూఎస్ అబ్రహం లింకన్ నౌకపై కనీసం ఏడు క్షిపణి దాడులు జరిపినట్లు తెలిపారు. దీంతో కొంతకాలం అమెరికా వైమానిక కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయని పేర్కొన్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలో 100కి పైగా దాడులు నిర్వహించినట్లు ఇరాన్ పేర్కొంది. అలాగే శత్రు దేశాల నౌకలకు హార్ముజ్ మార్గాన్ని మూసివేసినట్లు వెల్లడించింది. ఇక అమెరికా చర్యలను “పైరసీ”గా పేర్కొంటూ ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది. “సోమాలియా దొంగల కంటే అమెరికా చెడ్డది” అంటూ వ్యాఖ్యానించింది. ఇరాన్ నౌకలను అక్రమంగా స్వాధీనం చేసుకుని.. సిబ్బందిని బంధించారని ఆరోపించింది.
తాజాగా ట్రంప్ మాట్లాడుతూ హార్ముజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందం చేసుకునేంత వరకు హార్ముజ్ జలసంధిపై విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయబోమని తేల్చి చెప్పారు. ముందు దిగ్బంధం ఎత్తేస్తేనే అణు ఒప్పందంపై చర్చిస్తామన్న ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ ముందు తగిన విధంగా అణు ఒప్పందం చేసుకుంటనే దిగ్బంధాన్ని ఎత్తివేస్తామని.. లేదంటే దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ పరిణామాలు చూస్తుంటే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా, భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
-
Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
ట్రెండింగ్
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు