Trump: హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
- హార్ముజ్‌పై ట్రంప్ కఠిన నిర్ణయం
- ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్‌లు
- ప్రపంచ దేశాలు ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్ మోగబోతున్నాయా? ఇరాన్ మరింత ఉక్కిరిబిక్కిరి కాబోతుందా?. చమురు, గ్యాస్ కష్టాలు మరింత తీవ్రం కాబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా హార్ముజ్‌పై ట్రంప్ డెడ్‌లాక్ విధించారు. దీంతో పరిస్థితులు మరింత సంక్షోభం దిశగా వెళ్తొచ్చని సంకేతాలు వెళ్తున్నాయి.
తాజాగా ట్రంప్ మాట్లాడుతూ హార్ముజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందం చేసుకునేంత వరకు హార్ముజ్ జలసంధిపై విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయబోమని తేల్చి చెప్పారు. ముందు దిగ్బంధం ఎత్తేస్తేనే అణు ఒప్పందంపై చర్చిస్తామన్న ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ ముందు తగిన విధంగా అణు ఒప్పందం చేసుకుంటనే దిగ్బంధాన్ని ఎత్తివేస్తామని.. లేదంటే దిగ్బంధం కొనసాగుతుందని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
తాజా దిగ్బంధం బాంబు దాడుల కంటే మరింత తీవ్రంగా ఉంటుందని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు. ఇరాన్ పరిస్థితి ప్రస్తుతం తీవ్రంగా ఉందని.. వారు పూర్తిగా ఒత్తిడిలో ఉన్నారని.. వారికి ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలు ఉండకూడదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
పోస్ట్ వైరల్
ఇక ట్రంప్ తన సోషల్ మీడియాలో ఏఐతో రూపొందించిన చిత్రాన్ని షేర్ చేశారు. ఆ చిత్రంలో ఆయుధంతో కనిపించారు. నల్ల సూటు ధరించి.. కళ్ళద్దాలు పెట్టుకుని.. చేతిలో అసాల్ట్ రైఫిల్ పట్టుకున్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆ చిత్రానికి క్యాప్షన్‌లో.. ‘‘ఇరాన్ సరిగ్గా ప్రవర్తించలేకపోతోంది. అణ్వాయుధ రహిత ఒప్పందంపై ఎలా సంతకం చేయాలో వారికి తెలియదు. వారు త్వరగా బుద్ధి తెచ్చుకోవాలి! ఇకపై నేను మంచివాడిని కాను!.’’ అని రాసుకొచ్చారు.
సైనిక హెచ్చరిక
దిగ్బంధమే ప్రధాన ఒత్తిడి సాధనంగా ఉన్నప్పటికీ.. అవసరమైతే సైనిక చర్యకు కూడా సిద్ధమని ట్రంప్ సూచించారు. ఇరాన్ చమురు ఎగుమతులు పూర్తిగా ఆగిపోవడంతో పైప్లైన్లు కూడా ప్రమాదంలో ఉన్నాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఇరాన్ ప్రతిస్పందన
అమెరికా చర్యలకు ఇరాన్ భద్రతా వర్గాలు తీవ్రంగా స్పందించాయి. ‘‘దిగ్బంధం కొనసాగితే మేము అనూహ్యమైన చర్యలు తీసుకుంటాం.’’ అని హెచ్చరించాయి. దౌత్యానికి అవకాశం ఇస్తున్నప్పటికీ.. సహనానికి కూడా పరిమితులు ఉన్నాయని స్పష్టం చేశాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో ప్రతీకారంగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. దాదాపు రెండు నెలల నుంచి ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇరాన్ అణు ఒప్పందం చేసుకోకపోవడంతో అమెరికా హార్ముజ్‌ను దిగ్బంధించింది. దీంతో చమురు సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే ఆయా దేశాల్లో సంక్షోభం నెలకొంది. తాజాగా ఆ దిగ్బంధాన్ని మరింత తీవ్రం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ప్రపంచ దేశాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!