Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
- ఐపీఎల్ 2026లో బెంబేలెత్తిపోతున్న బుమ్రా
- బుమ్రా కెరీర్‌లో గడ్డు రోజులు
- 58 పరుగులు సమర్పించుకున్న బుమ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jasprit Bumrah Worst T20 Spells: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బూమ్ బూమ్ తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్స్ పడగొడుతాడు. తన యార్కర్లు, స్లోవర్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పే బుమ్రా.. టీ20 ఫార్మాట్‌లో అత్యంత నమ్మకమైన బౌలర్లలో ఒకడు. అయితే ప్రతి బౌలర్ కెరీర్‌లో కొన్ని గడ్డు రోజులు ఉంటాయి. ఆ గడ్డు కాలం ఇప్పుడు బుమ్రాకు నడుస్తోంది. ఐపీఎల్ 2026లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఇటీవలి రోజుల్లో వికెట్స్ తీయకపోగా.. భారీగా రన్స్ సమర్పించుకుంటున్నాడు.
టీ20ల్లో న్యూజిలాండ్‌పై జస్ప్రీత్ బుమ్రా అత్యధికంగా పరుగులు ఇచ్చాడు. 2026లో తిరువనంతపురంలో జరిగిన ఆ మ్యాచ్‌లో వికెట్ తీయకుండా 58 పరుగులు సమర్పించుకున్నాడు. ఇదే బుమ్రా కెరీర్‌లో అత్యంత ఖరీదైన స్పెల్. తాజాగా ముంబై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 54 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 55 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అదే ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 52 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేదు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్ 2026లో జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లే తీశాడు. 132 సగటు, 8.8 ఎకానమీ నమోదు చేశాడు. బుమ్రా తన ఐపీఎల్ కెరీర్లోనే ఎన్నడూ ఇంతటి పేలవ ప్రదర్శన చేయలేదు. ఈ గణాంకాలు చూస్తే.. ఎంత గొప్ప బౌలర్ అయినా కొన్ని మ్యాచ్‌ల్లో తేలిపోతాడని అర్ధమవుతోంది. టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్ల ఆధిపత్యం పెరిగిన నేపథ్యంలో బౌలర్లకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ తన అనుభవంతో మళ్లీ బలంగా పుంజుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!