Freezer Ice Smell Solution: ఫ్రీజర్‌లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Freezer Ice Smell Solution: వేసవి కాలంలో చల్లని పానీయాలు తాగేటప్పుడు ఐస్ తప్పనిసరి. అయితే, కొన్నిసార్లు ఫ్రీజర్‌లో తయారయ్యే ఐస్‌కు వింత వాసన రావడం వల్ల పానీయాల రుచి కూడా చెడిపోతుంది. ఈ సమస్య చాలా మందికి ఎదురవుతుంటుంది. ఐస్‌కు వచ్చే ఈ దుర్వాసనకు ప్రధాన కారణం ఫ్రీజర్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వాసనలు కూడా కారణం అవుతుంటాయి.. ఫ్రీజర్‌లో గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, అలాగే తెరిచి ఉంచిన ఆహారం నుంచి వచ్చే వాసనలు ఐస్‌లోకి చేరడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా చేపలు, ఉల్లిపాయలు వంటి ఘాటైన వాసన కలిగిన పదార్థాలను సరిగ్గా కవర్ చేయకుండా ఉంచితే, వాటి వాసన ఐస్ క్యూబ్స్‌లోకి చేరిపోతుంది.
దుర్వాసను తరిమివేసే చిట్కాలు..
* ఈ సమస్యను నివారించాలంటే ముందుగా ఫ్రీజర్‌లో ఉన్న ఆహారాన్ని సరిగా ప్యాక్ చేయడం చాలా అవసరం. ఎల్లప్పుడూ గాలి చొరబడని డబ్బాలు లేదా కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయాలి. అలాగే ఐస్ ట్రేలను కూడా మూత ఉన్న డబ్బాల్లో లేదా సీల్డ్ బ్యాగ్‌లలో ఉంచడం వల్ల బయటి వాసనలు ఐస్‌పై పడకుండా ఉంటుంది.
Also Read
- Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
* ఫ్రీజర్‌లో దుర్వాసనలను తొలగించడానికి బేకింగ్ సోడా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రీజర్‌లో ఒక మూలలో మూతలేని పాత్రలో బేకింగ్ సోడా ఉంచితే, అది గాలిలోని చెడు వాసనలను పీల్చుకుని ఫ్రీజర్‌ను తాజాగా ఉంచుతుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి బేకింగ్ సోడాను మార్చడం మంచిది.
* ఇంకా ఒక ముఖ్యమైన చిట్కా ఏమిటంటే ఐస్‌ను క్రమం తప్పకుండా మార్చడం. చాలా రోజుల పాటు నిల్వ ఉంచిన ఐస్ తేమను, వాసనలను పీల్చుకుని రుచి కోల్పోతుంది. అందుకే ప్రతి రెండు వారాలకు ఒకసారి ఐస్ ట్రేను ఖాళీ చేసి, గోరువెచ్చని నీరు, సబ్బుతో శుభ్రం చేసి మళ్లీ కొత్త ఐస్ తయారు చేయడం మంచిది.
* ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే, ఫ్రీజర్‌లోని ఐస్ ఎప్పుడూ స్వచ్ఛంగా, వాసన లేకుండా ఉంటుంది. దీంతో మీ చల్లని పానీయాలు మరింత రుచిగా మారుతాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!