Minister Kollu Ravindra: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాస్త్ర మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బందరులో బియ్యం దొంగ పేర్ని నాని ఉన్నాడు అని పేర్కొన్నారు. రైస్ కొట్టేసి భార్య పేరు మీద పెట్టాడు.. అరెస్టు ఒకటే పెండింగ్ లో ఉంది అని తెలిపారు. అరెస్టు కూడా త్వరలోనే జరుగుతుందని భావిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఇక, గుడివాడలో గుట్కా నాని ప్రస్తుతం అడ్రస్ కూడా లేదు.. ఎక్కడున్న అరెస్టు చేస్తామని గతంలోనే చెప్పాం చేస్తామని కొల్లు రవీంద్ర అన్నారు.
Read Also: AP High Court Jobs: హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు.. నెలకు రూ. 77 వేల జీతం
ఇక, వల్లభనేని వంశీ టీడీపీ టికెట్ మీద గెలిచి నారా చంద్రబాబు నాయుడిని తిట్టాడు అని మంత్రి రవీంద్ర తెలిపారు. తప్పు చేసి తప్పించుకోవడం కోసం మళ్ళీ తప్పు చేసి దొరికాడు అని ఎద్దేవా చేశారు. జైలులో తిడుతున్నాడు అంటా.. ఈ పరిస్థితి తెచ్చిన వైఎస్ జగన్ ను వంశీ తిట్టాలి అని ఆయన సూచించారు.