ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL 2025) షెడ్యూల్ ఈరోజు రిలీజ్ కానుంది. కొన్ని రోజులుగా కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్ గురించి నివేదికలు వస్తున్నాయి. టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22న జరుగుతుందని.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి బ్లాక్‌బస్టర్ మ్యాచ్ చేపాక్ మైదానంలో జరుగనుంది.