IPL 2025: దమ్ముంటే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి.. జైపూర్ స్టేడియానికి బాంబు బెదిరింపులు!
- జైపూర్ స్టేడియానికి బాంబు బెదిరింపులు
- దమ్ముంటే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి అంటూమెయిల్
- మెయిల్‌పై విచారణ చేస్తున్న అధికారులు
- మే 16న పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్‌కు ఓ మెయిల్ వచ్చింది. స్టేడియం అధికారులు వెంటనే జైపుర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం జైపుర్ స్టేడియంలో బాంబు పేలుడు నిర్వహిస్తాం. మీకు వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ మెయిల్ వచ్చిందని తెలిపారు. దీంతో భద్రతా దళాలు స్టేడియం చుట్టుపక్కల సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. మెయిల్‌పై అధికారులు విచారణ చేస్తున్నారు.
ప్రస్తుతం భారత్‌లో ఐపీఎల్ 2025 కొనసాగుతోంది. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ మ్యాచ్‌లు ఆడుతోంది. మే 16న పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను జైపుర్‌లో ఆడనుంది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఉండనుంది. జైపూర్‌కు బాంబు బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని నెలలుగా జైపూర్‌కు ఇలాంటి బెదిరింపులు చాలా వచ్చాయి. ఏప్రిల్ 3న జైపూర్ జిల్లా కలెక్టరేట్‌ను పేల్చివేస్తామని బెదిరింపు వచ్చింది. ఫిబ్రవరి 20న ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీని పిలుస్తామని బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 4న జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. వరుస బెదిరింపులు నగర భద్రత గురించి ఆందోళనలను రేకెత్తించాయి.
Also Read
Also Read: Rohit Sharma: అంతా చెత్త.. భారత్ కామెంటేటర్లపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు!
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్ర స్థావరాలను కుప్పకూల్చింది. ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు 100 మందిని మట్టుబెట్టినట్లు కేంద్రం అధికారికంగా తెలిపింది. ఆపరేషన్ సిందూర్‌తో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ సమయంలో పాకిస్థాన్ బెదిరింపులకు పాల్పడుతోంది.
తాజావార్తలు
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!