జైపుర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్‌కు ఓ మెయిల్ వచ్చింది. స్టేడియం అధికారులు వెంటనే జైపుర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం జైపుర్ స్టేడియంలో బాంబు పేలుడు నిర్వహిస్తాం. మీకు వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’ అంటూ మెయిల్ వచ్చిందని తెలిపారు. దీంతో భద్రతా దళాలు స్టేడియం చుట్టుపక్కల సెక్యూరిటీని కట్టుదిట్టం…