ఐపీఎల్ అంటే వరల్డ్ రిచెస్ట్ క్యాష్ లీగ్.. ఆటగాళ్ల రాతను ఒక్కరోజులో మార్చేసే క్రికెట్ లీగ్ సత్తా ఉన్న ప్లేయర్ కోసం ఎన్ని కోట్లు అయినా పెట్టేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉంటాయి. మరి ప్లేయర్స్ కోసం భారీగా ఖర్చు చేసిన ఫ్రాంఛైజీలు ఉన్నాయి. ప్రతీ సీజన్ కి ముందు స్టార్ ప్లేయర్లను వేలంలో భారీ ధర పెట్టి కొనుగోలు చేయడం, వాళ్లు బాగా ఆడడం లేదని తర్వాతి సీజన్ లో వదిలేసి.. మళ్లీ స్టార్లను కొనుగోలు చేయడం ఆర్సీబీకి ఆనవాయితీగా వస్తున్న అలవాటు. అందుకే ఐపీఎల్ 2008 నుంచి 2022 వరకూ ఆర్సీబీ ఆటగాళ్లకు చెల్లించిన మొత్తం శాలరీ వెయ్యి కోట్లు దాటేసింది. ఇప్పటిదాకా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ల కోసం ఖర్చ చేసిన మొత్తం రూ. 1003.7 కోట్లుగా ఉంది. అంటే వెయ్యి కోట్లకు పైగా జీతాలు ఇచ్చిన మొట్టమొదటి ఫ్రాంఛైజీ ఆర్సీబీ.
Also Read : UK: త్రివర్ణ పతాకంతో ఖలిస్తాని మద్దతుదారులకు స్ట్రాంగ్ రిఫ్లై
ఐదుసార్లు టైటిల్ సాధించిన ముంబై ఇండియన్స్,ప్లేయర్లను అంత ఈజీగా వదులుకోదు.. అయితే ముంబైలో ఉంటే క్రిస్ లీన్, జేమ్స్ నీశమ్ వంటి స్టార్లు కూడా రిజర్వు బెంచ్ లో కూర్చోవాల్సిందే. ఐపీఎల్ 2023 సీజన్ వరకూ ఆటగాళ్ల పారితోషికాల కింద రూ. 978.3 కోట్లను ముంబై ఇండియన్స్ జట్టు చెల్లించుకుంది. రెండు సార్లు టైటిల్ గెలుచుకున్న కోత్ కత్తా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ కూడా స్టార్ ప్లేయర్ల కోసం కోట్లు చెల్లించేందుకు సిద్దంగా ఉంటుంది. ఐపీఎల్ 2023 సీజన్ వరకూ కోల్ కత్తా నైట్ రైడర్స్ , ఆటగాళ్ల కోసం మొత్తం చెల్లించిన రూ. 939.6కోట్లగా ఉంది.
Also Read : Deputy CM Narayana Swamy: స్పీకర్ మీద చేయివేశారు.. కాపాడటానికే ఎమ్మెల్యేలు వెళ్లారు..!
ఒక్కసారి ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా, ప్లేయర్ల కొనుగోలు విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్కడ తగ్గదు. ఐపీఎల్ 2023 వరకూ క్యాపిటల్స్,ప్లేయర్స్ జీతాల కింద మొత్తం రూ. 918 కోట్లను చెల్లించింది. ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ల కోసం రూ. 900 కోట్లకు పైగా ఖర్చ చిసిన నాలుగో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఐపీఎల్ ప్లేయర్ల కోసం కోట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉండే పంజాబ్ కింగ్స్,2023 సీజన్ వరకూ ఆటగాళ్ల జీతాల నిమిత్తం రూ. 860.9 కోట్లను ఖర్చు చేసింది.
Also Read : Asia Cup : పాక్ కు ఇదే లాస్ట్ ఛాన్స్.. ఆసియా కప్ నిర్వహణే ప్రధాన లక్ష్యం..!
నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, 2 సీజన్లు బ్యాన్ పడి.. ఐపీఎల్ కి దూరమైంది. అయినా జీతాల విషయంలో టాప్ 6లో నిలిచింది. 2023 సీజన్ వరకూ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లకు చెల్లించిన జీతాలు రూ. 854.1 కోట్లుగా ఉంది. ఆ రెండు సీజన్లు కూడా ఆడి ఉంటే సీఎస్కే టీమ్ టాప్ 3లో ఉండి ఉండేది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2013లోనే అయినా, ఆటగాళ్ల కోసం కోట్లు ఖర్చు పెట్టడంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్లేయర్లను మార్చేందుకు, కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు సన్ రైజర్స్ ఇప్పటిదాకా ప్లేయర్ల కోసం రూ. 735.4 కోట్ల ఖర్చ చేసింది.
Also Read : Pushpa 2: మూడు నిమిషాల టీజర్ వస్తోంది… పాన్ ఇండియా రికార్డులు లేస్తాయ్…
సీఎస్క్ తో పాటు రెండు సీజన్లు బ్యాన్ కు గురైనా రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ ప్లేయర్ల కోసం రూ. 704.8కోట్లు ఖర్చు చేసింది. మొట్టమొదటి సీజన్ లోనే టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, ఐపీఎల్ 2022 సీజన్ లో రన్నరప్ గా నిలిచింది. కొత్త ఫ్రాంఛైజీలు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కూడా ఆటగాళ్ల కొనుగోలు విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. రాహుల్ కోసం రూ. 17 కోట్లు చెల్లిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ , రెండు సీజన్లలో కలిసి రూ. 179.8 కోట్లు.. ఆటగాళ్ల జీతాల కోసం చెల్లిస్తుంటే ఐపీఎల్ 2022 టైటిల్ విన్నర్ గుజరాత్ జెయింట్స్ రూ. 174.3 కోట్లు చెల్లిస్తూ ఆఖరి పొజిషన్ లో ఉంది.